అదుర్స్: అర్జెంటీనా డ్యాన్సర్‌తో ఒబామా ట్యాంగో డ్యాన్స్
బునోస్ ఎయిరెస్: చిన్నతనం నుంచి తనకు అర్జెంటీనా అంటే ఇష్టమని, ప్రస్తుతం ఆ దేశ యువత దేశాభివృద్ధి దిశగా ఆలోచిస్తుందని ఒబామా మెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా పర్యటనలో ఉన్న ఆయన రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఆయన బిజీగా గడిపారు.
క్యూబా పర్యటన అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ పర్యనటకు వచ్చారు. రాజధానిలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా టౌన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతను ఉత్తేజపరిచే ప్రసంగం చేశారు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గౌరవార్థం అర్జెంటీనా అధ్యక్షుడు బునోస్ ఎయిరెస్‌లోని ఓ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన అధికారిక విందుకు ఆయన హాజరయ్యారు. ఈ డిన్నర్‌కి పలువురు అర్జెంటీనా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు టాంగో నృత్యం చేశారు.

విందు: డ్యాన్సర్‌తో కలిసి ఒబామా ట్యాంగో డ్యాన్స్
ఈ టాంగో నృత్యం అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఒబామా లేడీ డ్యాన్సర్ మోరా గొడయ్‌తో కలిసి లయబద్ధంగా నృత్యం చేశారు. అంతేకాదు గతంలో అనుభవం ఉన్న డ్యాన్సర్‌లా ఒబామా ట్యాంగో స్టెప్పులు వేశారు.

విందు: డ్యాన్సర్‌తో కలిసి ఒబామా ట్యాంగో డ్యాన్స్
అదేసమయంలో ఒబామా సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్లీ కూడా ఈ డ్యాన్స్‌లో జతకలిశారు. పురుష డ్యాన్సర్ జోస్ లాగోన్స్‌తో కలిసి ఆమె కూడా చక్కగా స్టెప్పులు వేశారు. ఒబామా, మిషెల్లీ స్టెప్పులతో ఈ డిన్నర్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది.

లేడీ డ్యాన్సర్ గొడయ్ ట్యాంగో నృత్యం చేస్తూ సరదాగా ఒబామా చేయిపట్టి తనతో నృత్యం చేయడానికి ఆహ్వానించారు. మొదట మొహమాట పడినా.. ఆ తర్వాత చాలా ఉత్సాహంగా ఒబామా స్టెప్పులు వేశారు.
విందు: డ్యాన్సర్‌తో కలిసి ఒబామా ట్యాంగో డ్యాన్స్
అటు మిషెల్లీ కూడా సరదాగా డ్యాన్స్ చేసింది. ఒబామాను పిలిచినప్పుడు తనకు ట్యాంగో డ్యాన్స్ రాదని చెప్పారని, అయితే జస్ట్ నన్ను ఫాలో కండి అని చెప్పానని డ్యాన్సర్ గొడయ్ తెలిపింది. 'ఆయన 'ఓకే' అని డ్యాన్స్ ప్రారంభించారు. నిజానికి ఆయన స్టెప్పులకు అనుగుణంగా నేను ఆడాను. ఎందుకంటే ఒబామా చాలామంచి డ్యాన్సర్' అని ఆమె తెలిపింది.

Click it and Unblock the Notifications