టార్గెట్ పుతిన్ : రష్యాకు వ్యతిరేకంగా అతిపెద్ద కూటమి !! .. భారత్ చేరాలని బ్రిటన్ పిలుపు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఏమాత్రం తగ్గలేదు . మరింత దూకుడుతో దూసుకెళ్తోంది. ఉక్రెయిన్‌లో కీవ్ తర్వాత పెద్ద నగరమైన ఖార్కివ్‌లో మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడుతోంది. ఫిరంగులు, క్షిపణులను ప్రయోగించడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ దాడుల్లో సైనికులతో పాటు సామన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఎటు చూసినా పరిస్థితులు హృదయవిదారకంగా కన్పిస్తున్నాయి.
Recommended Video

రష్యా సేనల ఆధీనంలోకి ఖేర్సన్
మరోవైపు ఖేర్సన్ నగరం పూర్తిగా రష్యా సేనల అధీనంలోకి వెళ్లిపోయింది. మరో నగరం మరియుపోల్ వైపు రష్యా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అగ్రదేశాలతో పాటు ఐరోపా దేశాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కఠిన ఆంక్షలు విధించాయి. అయినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ లోని నివాసాలు, ఆస్పత్రులపై బాంబులతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ చర్యలపై బ్రిటన్ తీవ్రంగా విరుచుకుపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని యుద్ధ నేరస్థుడిగా పేర్కొంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు రష్యా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

పుతిన్‌కు వ్యతిరేకంగా కూటమి
ఉక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా ముగింపు పలకాలని బ్రిటన్ కోరింది. దూకుడును తగ్గించుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు బ్రిటన్ పిలుపునిచ్చింది. ఈ కూటమిలో భారత్ కూడా ఉండాలని పేర్కొంది. ఉక్రెయిన్‌పై పుతిన్ దుర్మార్గపు దాడులను అన్నిదేశాలు ఖండించాలని కోరింది. ఈమేరకు ప్రపంచదేశాలను కోరనున్నారు. అందులో భాగంగా భారత ప్రధాని మోదీతో బ్రిటన్ త్వరలో ఫోన్ చేస్తారని బ్రిటన్ ప్రధాని బోరిస్ అధికార ప్రతినిధి తెలిపారు.

రష్యాలో నిరసనలు
అటు ఉక్రెయిన్ పై దాడులకు వ్యతిరేకంగా రష్యాలోనూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను ఆదేశ ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ తీవ్రంగా తప్పుపట్టారు. గత చరిత్రను పట్టుకుని ఉక్రెయిన్ ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి , సామరస్యం కోసం ప్రపంచదేశాలు కృషి చేయాలని ఎలెక్సీ కోరారు.

యుద్ధనికి వ్యతిరేకంగా ఉద్యమం
ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని చేయాలని ఎలెక్సీ పిలుపునిచ్చారు. పుతిన్ దురాక్రమణ చర్యలను ఖండిస్తూ రష్యా ప్రధాన కూడళ్లో నిరసనలు తెలపాలని ప్రజలను కోరారు. విదేశాల్లో ఉన్న రష్యన్ ప్రజలు కూడా అక్కడి రష్యా రాయబార కార్యాలయ ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎలెక్సీ సూచించారు.












Click it and Unblock the Notifications