లెక్క తప్పిన లెక్కల మాష్టారు : సెక్సువల్ వేధింపులతో కటకటాల్లోకి
కువైట్ : 65 ఏళ్ల వయసు, అందునా.. ఓ ఉపాధ్యాయుడు, వృత్తి.. లెక్కలు బోధించడం, కానీ జీవితంలో మాత్రం లెక్క తప్పాడు. విద్యాబుద్దుల సంగతి పక్కనబెట్టి, ట్యూషన్ క్లాసులను తన సెక్స్ కార్యాకలాపాలకు కేరాఫ్ గా మార్చుకున్నాడు. విద్యార్థులకు లెక్కలు చెప్పాల్సింది పోయి, లైంగిక పాఠాలను వల్లె వేయడం మొదలుపెట్టాడు.
అయితే ఎంతటి రహస్యమైనా.. ఎప్పుడోసారి బయటపడాల్సిందే అన్నట్టు మొత్తానికి కొంతమంది తెలివైన విద్యార్థిణులు, సదరు మాష్టారు గారి చర్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకేముంది ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతూ జైళ్లో కాలం వెళ్లదీస్తున్నాడు.

ఇంతకీ జరిగిన విషయమేంటంటే.. స్థానిక అరబిక్ డైలీ కథనం ప్రకారం, ఓ 65 ఏళ్ళ పాకిస్థానీ టీచర్ అక్కడి ప్రైవేటు స్కూల్స్ లో లెక్కల మాస్టారుగా పనిచేస్తుండేవాడు. అయితే తన వక్ర బుద్దిని మాత్రం వదిలించుకోని ఆ మాష్టారు, ట్యూషన్ కోసం తన వద్దకు వచ్చే విద్యార్థిణులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మాష్టారు చర్యల పట్ల తీవ్ర అసహనానికి గురైన కొంతమంది విద్యార్థిణులు అతగాడి వేధింపులను ఓ వీడియోలో బంధించి ఇంటర్నెనెట్ లో పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ ద్వారా మొత్తానికి ఆ నోటా.. ఈ నోటా.. విషయం కాస్త పోలీసుల చెవిన పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అతనిపై నేరం నిరూపించబడితే, దేశం నుంచి బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications