16 ఏళ్ల విద్యార్దికి టాప్‌లెస్ ఫోటోలు, 5ఏళ్లు నిషేధం
లండన్: టాప్ లెస్ చిత్రాలను 16 ఏళ్ల విద్యార్దికి పంపిన బ్రిటీషు మహిళా టీచర్‌పై ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించారు. వివరాల్లోకి వెళితే లంకషేర్లోని పార్క్ హైస్కూల్‌లో పని చేస్తున్న లిండా హార్వే(43)కు సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్ ద్వారా 16ఏళ్ల విద్యార్దితో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వీరిద్దరూ ఫోన్ నెంబర్లు, మేసేజ్‌లు ఫోటోలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఫోటోల్లో లిండా హార్వేకు చెందిన టాప్‌లెస్ ఫోటో కూడా ఇందులో ఉంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రవర్తనా నియమావళి సంఘం ఆమెపై ఐదు సంవత్సరాలు నిషేధం విధించిందని డైలీ మెయిల్ పేర్కొంది.

లిండా హార్వే చర్య ఉపాద్యాయ వృత్తిని అవమానించేలా ఉందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. ఈ విషయంపై 2019 సెప్టెంబర్ వరకు అప్పీలు చేసుకునే వెసులుబాటు లేకుండా చేసింది.












Click it and Unblock the Notifications