బర్త్ డే గిఫ్ట్ గా.. స్టూడెంట్స్ తో టీచర్ సెక్స్

Subscribe to Oneindia Telugu

పెన్సిల్వేనియా : స్టూడెంట్స్ కు మంచి గైడెన్స్ ఇవ్వాల్సిన టీచర్.. తానే ట్రాక్ తప్పింది. చదువు చుట్టు తిరిగే విద్యార్థుల ఆలోచనలను సెక్స్ వైపు మళ్లించింది. సలహా కోసం సంప్రదిస్తే.. ఏకంగా సెక్స్ కార్యకలాపాలకే తెరలేపి అడ్డంగా బుక్కయ్యింది.

అమెరికాలోని మిల్టన్ కు చెందిన చెల్సియా లార్సన్ (25) అనే ఓ టీచర్.. తన విద్యార్థులతో సెక్స్ లో పాల్గొని వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ అసలు విషయమేంటంటే.. లార్సన్ టీచర్ గా పనిచేస్తోన్న లూయిస్ బర్గ్ ఏరియా హైస్కూల్ లో ఇద్దరు విద్యార్థి సోదరులు ఉన్నారు. అందులో ఒకరి పుట్టినరోజు కావడంతో.. ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని రెండో సోదరుడు టీచర్ ను ఫేస్ బుక్ ద్వారా సలహా అడిగాడు.

TEACHERS Aide withe alleged STDS accused of having sex with students

అందుకు ఆ టీచర్ గారు ఇచ్చిన సలహా ఏంటంటే.. బర్త్ డే గిఫ్ట్ గా తానే వారితో శృంగారంలో పాల్గొంటానని చెప్పింది. చెప్పడమే కాదు.. రెండు వేర్వేరు సందర్బాల్లో 17,15 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు సోదరులతో శృంగారంలో పాల్గొంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతోన్న సదరు టీచర్ కు 17 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు బఫెలో వ్యాలీ రీజనల్ పోలీసులు.

మైనర్లపై అత్యాచారం కింద లార్సన్ పై కేసు నమోదవగా.. ఆమెకు సుఖ వ్యాధులు ఉన్నట్లు కూడా నిర్దారించారు పోలీసులు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న లార్సన్.. విద్యార్థుల పట్ల దిగజారి వ్యవహరించడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New York Daily News reports that Chelsea Lorson, 25, a teacher’s aide at a Lewisburg Area High School, allegedly had sex with two brothers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి