ఆమె రిలీజ్ ఆలస్యం, బ్రిటన్లో మహిళను వివస్త్రని చేసి
కౌలాలంపూర్/లండన్: కినబాలు పర్వతం పైన దుస్తులు విప్పిన ఆరోపణల పైన మలేషియా పోలీసులు అరెస్టు చేసిన చేసిన వారిలో ఓ బ్రిటిష్ యువతి ఉన్న విషయం తెలిసిందే. పేపర్ వర్క్ ఆలస్యం కారణంగా ఆమె జైలు నుండి విడుదల కొంత ఆలస్యమైంది.
కినబాలు పర్వతం పైన దుస్తులు విప్పిన ఆరోపణల పైన మలేషియా పోలీసులు కొద్ది రోజుల క్రితం నాడు ఇద్దరు కెనడియన్లను, ఓ డచ్, ఓ బ్రిటన్ వ్యక్తిని అరెస్టు చేశారు. వారు నలుగురు శిఖరం అంచున నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇటీవల అక్కడ భూకంపం వచ్చింది. దానికి వారు దుస్తులు విప్పటమే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వారి పైన కేసు నమోదు చేశారు. కోట కినబాలు మెజిస్ట్రేట్ 23 ఏళ్ల బ్రిటన్ యువతి సహా పలువురిని దోషిగా తేల్చింది. అనంతరం వారిని విడుదల చేశారు. బెయిల్ పేపర్ వర్క్ ఆలస్యం కావడంతో బ్రిటన్ యువతి విడుదల ఒకరోజు వాయిదా పడింది. వారికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు కొంత మొత్తాన్ని జరిమానాగా విధించింది.

బ్రిటన్‌లో ఓ యువతిని వివస్త్రను చేసి...
బ్రిటన్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళను వివస్త్రను చేసి నాలుగేళ్లపాటు దర్యాఫ్తు కొనసాగించారు. లండన్‌లో ఓ యువతి స్నేహితులతో కలిసి నాటింగ్‌హాంలోని క్లబ్‌కు వెళ్లింది. అక్కడ మందు తాగింది. మరో పెగ్గు కూడా తాగిన ఆమె పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ప్రారంభించింది. ఆ యువతిని క్లబ్ బయట ఎవరో వదిలేశారు.
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో చిన్న గదిలో బందించారు. ఐదుగురు పోలీసులు ఆమెను వివస్త్రను చేశారు. వాటిని కెమెరాలు పెట్టి చిత్రీకరించారు. ఆ కెమెరాలను దర్యాఫ్తు విభాగానికి అనుసంధానం చేశారు.
వివస్త్రను చేసిన వారిలో ఓ మహిళా పోలీసు కూడా ఉన్నారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ బాధితురాలు తన పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఆమె మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లింది. 2011లో ఈ సంఘటన జరగాగా.. ఆమెకు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు న్యాయం జరిగింది.












Click it and Unblock the Notifications