క్రుజ్‌కు 5గురితో..: వివాహేతర సంబంధ ఆరోపణలు
వాషింగ్టన్: టెడ్ క్రుజ్‌కు ఐదుగురు మహిళలతో సంబంధం ఉందని ఓ సంచలన కథనం వచ్చింది. ఇది డొనాల్డ్ ట్రంప్ పనేనని క్రుజ్ మండిపడుతున్నారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలో రిపబ్లికన్ అభ్యర్థులు.. ట్రంప్, క్రుజ్‌లు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు.
తాజాగా, ఓ సంచలన కథనం క్రుజ్ పైన వచ్చింది. ఇది వివాదాస్పదం అయింది. నేషనల్ ఎంక్వైరర్ అనే దాంట్లో క్రుజ్‌కు ఐదుగురు మహిళలతో సంబంధాలు అంటూ కథనం వచ్చింది. ఓ లాయర్‌తో, ఓ స్కూల్ టీచర్‌తో, ఓ పొలిటికల్ కన్సల్టెంటుతో, ఓ మామూలు అమ్మాయితో, ఓ వేశ్యతో వివాహేతర సంబంధం ఉందని అందులోని అంశం.

దీనిని టెడ్ క్రుజ్ కొట్టి పారేస్తున్నారు. పత్రికల్లో వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి వార్తలు రావడానికి ట్రంప్, ఆయన అనుచరులే కారణమన్నారు. ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. క్రుజ్‌పై ప్రచురించిన వార్తల గురించిన తనకేమీ తెలియదన్నారు.
వార్త ప్రచురించిన పత్రికకు, క్రుజ్‌కు సంబంధించిన వివాదమని అందులో తాను జోక్యం చేసుకోలేనన్నారు. ట్రంప్‌కు మానసిక సమస్యలు ఉన్నాయని, వాటిని దాచిపెడుతున్నారని క్రుజ్ ప్రచార మేనేజర్ జెఫ్ రో ఒక ట్వీట్ చేశారు. ట్రంప్ కూడా.. క్రుజ్‌కు మానసిక ఆరోగ్య సంక్షోభం ఉందని ట్వీట్ చేశారు.
మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థులైన ట్రంప్, క్రుజ్‌లు అమెరికా జాతీయ భద్రతపై ప్రమాదకర ప్రకటనలు చేయడాన్ని సీనియర్ భద్రతాధికారులు తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు అమెరికాతో పాటు ప్రపంచానికి ప్రమాదకరమన్నారు.












Click it and Unblock the Notifications