వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేకప్ ఎక్కువైంది, అమ్మాయిని బస్సులోంచి తోసేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ఎక్కువ అందంగా తయారయిందని (ఎక్కువ మేకప్) ఓ బ్రిటిష్ ఏసియన్ టీనేజ్ యువతిని ఓ మహిళా కండక్టర్ బస్సులో నుంచి కిందకు దింపేసిన సంఘటన బ్రిటన్‌లో జరిగింది. ఆ అమ్మాయి పేరు జహ్రా సాదిక్.

జహ్రా స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు చాలా గ్లామర్‌గా ముస్తాబైంది. ఇంటి నుంచి బర్మింగ్‌హామ్ సెంటర్ వెళ్లేందుకు నేషనల్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కింది. పదిహేనేళ్ల జహ్రా బస్సు ఎక్కగానే కండక్టర్ ఆమెను టికెట్ అడిగింది. తాను తీసుకున్న పిల్లల టికెట్‌ను ఆ అమ్మాయి కండక్టర్‌కు చూపించింది.

అమ్మాయిని చూస్తుంటే చిన్నపిల్లలా కనిపించలేదు. దీంతో సదరు కండక్టర్ ఆమె వయస్సును అడిగింది. అమ్మాయి సమాధానంతో కండక్టర్ సంతృప్తి చెందలేదు. దీంతో ప్రయాణీకులు చూస్తుండగానే జహ్రాను కండకండర్ బస్సులోంచి బయటకే నెట్టేసింది.

Teen Girl Thrown Off UK Bus For Too Much Makeup

ఆ టీనేజర్‌పై రూ.మూడు వేలు జరిమానా కూడా విధించారు. ఇక బర్మింగ్‌హామ్ సెంటర్‌కు వెళ్లేందుకు ఆ అమ్మాయి నాలుగు మైళ్లు నడవాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యంతా లిప్‌స్టిక్ వల్లే అని తర్వాత తెలిసింది.

పిల్లల టికెట్‌తో ప్రయాణం చేసిన జహ్రాను కండక్టర్ తప్పుపట్టింది. తన వయసు పదిహేనేళ్లు అంటూ టీనేజర్ ఇచ్చిన సమాధానం కండక్టర్‌కు నచ్చలేదు. జహ్రా లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల ఆమె వయసు పదహారేళ్లు దాటి ఉంటుందని కండక్టర్ భావించింది. గుర్తింపు కార్డు కూడా దగ్గర లేదు. కండక్టర్ దారుణంగా ప్రవర్తించిందని జహ్రా బంధువులు మండిపడ్డారు. దీనిపై ఫిర్యాదు చేశారు.

English summary
A British Asian teenage girl was thrown off a bus by a woman conductor for 'wearing too much make-up' to have a child's ticket, according to a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X