మిస్ అమెరికా నీనా దవులూరితో హద్దు మీరిన విద్యార్థి

న్యూయార్క్: మిస్ అమెరికా నీనా దవులూరితో హద్దులు మీరి మాట్లాడిన ఓ విద్యార్థిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. గత గురువారం నీనా దవులూరి పెన్సిల్వేనియాలోని ఓ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ తదితర అంశాల పైన చర్చిస్తున్నారు. ఈ సమయంలో పాట్రిక్ ఫర్వేస్ అనే సీనియర్ విద్యార్థి నీనా దవులూరితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాట్రిక్ ఓ ప్లాస్టిక్ గులాబీ పువ్వుతో స్టేజ్ పైకి వచ్చాడు.

Teen suspended for asking Miss America Nina Davuluri to prom

ఆమెతో హద్దుమీరి మాట్లాడాడు. ఆ సమయంలో ఏం చేయాలో తోచని నీనా నవ్వుతూ ఉండిపోయారు. దీనికి అతను మూల్యం చెల్లించుకున్నాడు.

అతని ఆకతాయి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం అతనిని మూడు రోజులపాటు సస్పెండ్ చేసింది. అతని తీరును తప్పు పట్టిన యాజమాన్యం... అతనిని హెచ్చరించినట్లు చెప్పింది. ఆ విద్యార్థి ప్లాన్ ముందే తెలిసి హెచ్చరించామంది. కాగా, అనంతరం అతను క్షమాపణ చెబుతూ పాఠశాల యాజమాన్యానికి లేఖ రాశాడు. అతని వయస్సు పద్దెనిమిదేళ్లు. మరోవైపు తనతో హద్దుమీరి మాట్లాడిన విద్యార్థిని పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని నీనా దవులూరి తన మంచి మనసును చాటుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+