86 అంతస్తుల భవనం పైనుంచి పడి... సెల్ఫీయే కారణమా?

రష్యాలోని మాస్కోలో అలెగ్జాండర్(18) అనే యువకుడు 86 అంతస్తుల భవనం పైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. అతడి మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

మాస్కో: రష్యాలోని మాస్కోలో ఓ యువకుడు 86 అంతస్తుల భవనం పైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. అతడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడని కొందరు.. తండ్రితో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... మాస్కోలో 86 అంతస్తుల భవనం ఉంది. దీనిని ఓకో టవర్ అని పిలుస్తుంటారు. దీని ఎత్తు సుమారు 1,162 అడుగులు. ఈ భవనంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

స్థానికులు సేద తీరేందుకు పలు ఆటలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అలెగ్జాండర్(18) అనే యువకుడు ఓకో టవర్ పైనుంచి కింద పార్కింగ్ లో ఉన్న మెర్సిడెస్ జీ వాగన్ కారుపై పడి మృతి చెందాడు.

Teenager falls to his death from Europe’s tallest building as he ‘tries to take a selfie’

అయితే అతడి మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా వార్తాపత్రికల కథనం ప్రకారం... అలెగ్జాండర్ తండ్రితో కలిసి స్కేటింగ్ చేసేందుకు ఓకో టవర్ కు వచ్చాడట.

ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురైన అలెగ్జాండర్.. భవనంపై ఉన్న హెలీప్యాడ్ నుంచి కిందకు దూకేశాడట. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే, కొందరి కథనం మరోలా ఉంది. అతడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారి కింద పడినట్లు వారు పేర్కొంటున్నారు. కారణం ఏదైనా.. ఓ నిండు ప్రాణం పోయింది.. ఆ తండ్రికి పుత్రశోకం మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+