సెల్ఫీ తీసుకుంటూ.. గన్‌తో కాల్చుకున్నాడు
హూస్టన్: సెల్ఫీ తీసుకుందామనుకున్న సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో మరణించాడు. అమెరికాలోని హూస్టన్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. డెలియోన్ అలొన్సో స్మిత్ అనే 19 ఏళ్ల యువకుడు తుపాకీతో తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడ్డాడు. స్మిత్ తన అపార్ట్‌మెంట్‌లో లోడ్ చేసిన గన్‌తో పోజిచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ గొంతులోకి దూసుకెళ్లింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ సయమంలో అతని బంధువు మరో గదిలో ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, తాను వచ్చేలోగానే అతడు ప్రాణాలు కోల్పోయాడని యువకుడి బంధువు పోలీసులకు తెలిపాడు. ఇది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఘటనేనని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శరీరంపై తుపాకీ గాయం తప్ప మరే ఇతర గాయాలు లేవని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఈ ఏడాది ఆరంభంలో రష్యాలో ఓ యువతి గన్‌తో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.












Click it and Unblock the Notifications