అమెరికాలో ఫైరింగ్: తండ్రిని చంపేసి, పాఠశాలపై కాల్పులు

దక్షిణ కరోలినా: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ 14ఏళ్ల బాలుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపేసి.. ఆ తర్వాత సమీపంలోని స్కూల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్కూల్లోని ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్‌ గాయపడ్డారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కరోలినాకు చెందిన 14ఏళ్ల బాలుడు తన తండ్రి జెఫ్రీ డెవిట్‌ ఓస్‌బోర్న్‌(47)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఓ ట్రక్‌ తీసుకుని సమీపంలోని టౌన్‌విల్లె ఎలిమెంటరీ స్కూల్‌ మైదానంలోకి దూసుకెళ్లాడు. అక్కడ చిన్నారులపై కాల్పులకు తెగబడ్డారు.

 Teenager kills father at home before opening fire at nearby primary school

ఈ హఠాత్పరిణామానికి ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు వెంటనే చిన్నారులను తీసుకుని పాఠశాల భవనంలోని వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు పాఠశాలకు చేరుకునేలోపే ఓ అగ్నిమాపక వాలంటీర్‌ ప్రాణాలకు తెగించి అడ్డువెళ్లి కాల్పులు జరుపుతున్న బాలుడిని పట్టుకున్నాడు.

కాల్పుల్లో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, బాలుడు కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడన్నది మాత్రం తెలియరాలేదు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+