చుక్కెదురు: మోడీకి ఎందుకు రెడ్‌కార్నర్ నోటీసులు?
న్యూఢిల్లీ: ఐపీఎల్ మనీ లాండరింగ్ కేసులో ఇంటర్‌పోల్ నుంచి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురైంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్‌పోల్ ఈడీని ప్రశ్నించింది.
ఈ మేరకు గత నెల 20న ఇంటర్‌పోల్ నుంచి ఈడీకి లేఖ కూడా అందింది. ఆర్ధిక నేరారోపణలను ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని భారత్‌కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ఈడీ కూడా లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్‌పోల్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్‌పోల్ ప్రశ్నించింది.

ఈడీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను ఇంటర్‌పోల్‌కు సమర్పించింది. దేశపు అత్యున్నత విచారణ సంస్ధ రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే, దాన్ని ప్రశ్నించే హక్కు ఇంటర్‌పోల్‌కు లేదని ఇంటర్‌పోల్‌తో వ్వవహారలాను చక్కబెడుతున్న ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
సీబీఐ సూచనల మేరకే ఈడీ ఈ నోటీసులు ఇచ్చిందని, దీన్ని లియాన్‌లోని ఇంటర్‌పోల్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపామని, వారి నుంచి ఇటువంటి స్పందన వస్తుందని తాము ఊహించలేదని తెలిపారు. ఇంటర్‌పోల్ అనేది ఒక సులభతర ఏజెన్సీ అని చెప్పిన ఆయన, లలిత్ మోడీకి నోటీసులపై ఈ నెలాఖరులోగా ఇంటర్‌పోల్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం లలిత్ మోడీపై 16 కేసుల్లో విచారణ జరుగుతుండగా, వాటిల్లో 15 కేసులు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద నమోదయ్యాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications