వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన ప్రమాదం: అమెరికాలో తెలుగు పైలట్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kartheek
హైదరాబాద్: అమెరికా విమాన ప్రమాదంలో ఆంద్రప్రదేశ్‌కు చెందిన పైలట్ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం - అమెరికా, హూస్టన్ నగరంలోని హూక్స్ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి 7-15 గంటల ప్రాంతలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు చామకూర కార్తీక్ మృతి చెందాడు. కార్తీక్ తండ్రి నాగరాజు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి, ఆయన చిన్న కుమారుడు కార్తీక్. హైదరాబాద్‌లో చదువుకున్నాడు. అనంతరం సెప్టెంబర్ 28న ఫైలట్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళాడు. నెలన్నరగా శిక్షణ తీసుకుంటున్నాడు.

ఆదివారం రాత్రి విమానంలో శిక్షణలో ఉండగా విమానం ఇంజన్‌లో తలెత్తిన లోపంవల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించి కుప్పకూలింది. ఆ మంటల్లో కార్తీక్ దుర్మరణం చెందాడు. ఆయన మృతదేహాన్ని స్థానిక మెమొరియల్ ఆస్పత్రిలో ఉంచారు.

పోస్టుమార్టం పూర్తి కాగానే ఆంధ్రాకు పంపే ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన మరో వ్యక్తి ఇన్‌స్ట్రక్టర్ అని, అమెరికాకు చెందిన వారని తెలియవచ్చింది. ఆదివారం సెసినా 172 విమానంలో సాంకేతిక లోపం సంభవించిందని, దాంతో సింగిల్ ఇంజన్‌తో నడిచే సెసీనా పేలిపోయిందని సమాచారం.

English summary
A telugu pilot has been killed in a plane accident in USA on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X