షాకింగ్.. అమెరికాలోని ప్లాంట్ లో భారీ పేలుడు..
అగ్రరాజ్యం అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మిలిటరీ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేలుడు జరిగిన ప్లాంట్ నుంచి దట్టమైన పొగ కమ్మేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
టెన్నెస్సీ రాష్ట్రం, సౌత్ వెస్ట్ ఆఫ్ నాష్ విల్లే, బక్స్ నార్ట్ ప్రాంతంలోని అక్యురేట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్లాంట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న సమాచారం ఇంకా తెలియలేదు. పేలుడు కారణంగా ప్లాంట్ లోని పరిసర ప్రాంతాలు దట్టమైన పొగ అలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని హిక్ మాన్ కౌంటీ కు చెందిన అధికారి డేవిడ్ స్టీవార్ట్ తెలిపారు. ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని తాకుతోందని.. మంటలను అదుపుచేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్లాస్టింగ్ జరిగినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడకు చేరుకున్నట్లు.. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు. ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు డేవిడ్ స్టీవార్ట్ పేర్కొన్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో స్థానిక అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications