Israel-Hamas: అరౌరి మరణంతో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు..

ఇజ్రాయెల్ దళాలు హమాస్ డిప్యూటీ లీడర్ సలేహ్ అల్-అరౌరిని హతమార్చిన తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత పెరగింది. హమాస్ దాడి చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఉత్తర సరిహద్దులో తన దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో స్థానిక అధికారి హుస్సేన్ యాజ్బెక్‌తో సహా కనీసం తొమ్మిది మంది హిజ్బుల్లా సభ్యులు మరణించారు.

గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 22,000 దాటింది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పెరిగే అవకాశం ఉండడంతో తమ పౌరులను పలు దేశాలు హెచ్చరించాయి. వెంటనే లెబనాన్ ను వీడాలని స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ వివాదం ప్రాంతీయ సంఘర్షణగా పెరుగుతోందన్న నేపథ్యంలో లెబనాన్ హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా స్పందించారు. తాము నిశ్శబ్దంగా ఉండలేమని హెచ్చిరంచారు.

Tensions between Israel and Hamas increased after the death of terrorist Arouri

ఇజ్రాయెల్ యుద్ధాన్ని గాజా నుండి లెబనాన్ వరకు విస్తరించాలని ఎంచుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. అరౌరి మరణంతో శాంతి చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో స్టాప్‌తో సహా మధ్యప్రాచ్యానికి చేరుకుని శుక్రవారం ప్రభుత్వాధినేతలను కలవనున్నారు.

ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి US దౌత్య రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ కూడా ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నారు.
అయితే తమ దాడుల్లోనే అరౌరి చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. కానీ అతని ఇజ్రాయెల్ దళాలే మట్టుబెట్టాయని హమాస్ ఆరోపిస్తోంది. అరౌరీ మృతికి బదులు తీర్చుకుంటామని పేర్కొంటోంది. దీంతో ఈ యుద్ధం ఎక్కడి వెళ్తోందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+