చివరి కోరిక: విడుదలకాని సినిమా చూపించారు
న్యూయార్క్: అతనికి చిన్నతనం నుంచే ‘స్టార్ వార్స్' సిరీస్‌లో వచ్చే సినిమాలంటే అంటే పిచ్చి. ఎక్కడున్నా ‘స్టార్ వార్స్' సీక్వెల్స్‌ను వదలడు. అయితే, ఇప్పుడు చివరి కోరిక కూడా అది అవుతుందని అతనెప్పుడూ అనుకోలేదు. అతనే 32 ఏళ్ల డానియల్ ఫ్లీట్‌వుడ్.
క్యాన్సర్‌తో బాధపడుతున్న అతనికి డాక్టర్లు రెండు నెలల గడవు మాత్రమే ఇచ్చారు. అంతకంటే ఎక్కువ రోజులు అతడు బతికే అవకాశం లేదు. అయితే ఈ సమయంలో ఎప్పుడైనా మరణించే అవకాశం ఉండటంతో అతనిలో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో తాజా సీక్వెల్ ‘సార్ట్ వార్స్: ద ఫోర్స్ అవేకన్స్' డిసెంబర్ 18న రిలీజ్ కానుందనే విషయం అతనికి తెలిసింది. కానీ, అప్పటివరకు వేచి చూసే సమయం డానియల్‌కు లేకపోవడంతో ప్రాణం పోయేలోగా స్టార్ వార్స్ చూడాలన్నది అతని చివరి కోరికగా మార్చుకున్నాడు.
A terminally ill "Star Wars" fan, whose dying wish to see "The Force Awakens" created a sensation on social media, got...
Posted by KTLA 5 News on Thursday, November 5, 2015
భర్త చివరి కోర్కెను తీర్చేందుకు అతని భార్య ఫేస్‌బుక్‌లో ప్రచారం మొదలుపెట్టింది. ఆ చిత్ర దర్శకులు, నిర్మాతలను అభ్యర్థించింది. తన భర్తకు ఇష్టమైన ‘స్టార్ వార్స్'ను చూపించాలని కోరింది.
ఆమె విన్నపాన్ని మన్నించిన సినిమా హీరోలు మార్క్ హామిల్, పీటర్ మేహెమ్, జాన్ బోయెగాలు మద్దతు ఇచ్చారు. దీంతో చివరకు లూకాస్ ఫిల్మ్ సంస్థ డానియల్‌కు ‘స్టార్ వార్స్' చిత్రాన్ని విడుదల కాకుముందే చూపించింది.
కాగా, ఓ వ్యక్తి చివరి కోర్కెను తీర్చేందుకు విడుదల కాని సినిమాను చూపించిన చిత్ర నిర్మాణ సంస్థకు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications