ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు .. భారతీయుల వద్దకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు భయాందోళనకరంగా మారాయి. యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. బాంబులతో నగరాలపై మాస్కో దళాలు విరుచుకుపడుతున్నారు. ఖర్కివ్‌లో పరిస్థితులు మరింత క్షీణించాయని ల్వీవ్‌లోని భారత రాయభార కార్యాలయం తెలిపింది. ఖర్కివ్ నుంచి భారతీయులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించింది. కాలినడకన అయినా పెసోచిన్, బాబే , బెజ్లిడోవ్కా నగరాలకు వెంటనే తరలిపోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
బుకారెస్ట్ నుంచి ఆరు విమానాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రొమేనియాలో బుకారెస్ట్ నుంచి బుధవారం ఆరు విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ విమానాల్లో మొత్తం 1200 మందికి పైగా భారతీయ విద్యార్థుల్ని తరలిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి భారతీయుణ్ణి స్వదేశానికి తీసుకెళ్తాం
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల దగ్గరికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేరుకున్నారు. అక్కడ పరిస్థితుల గురించి వారితో మాట్లాడారు . ఎవరూ భయాందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. ఇక్కడు ఉన్న ప్రతి భారతీయుణ్ణి మన దేశానికి తీసుకెళ్లే వరకు తాను ఇక్కడే ఉంటానని వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు.
ఆపరేషన్ గంగ మిషన్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చే ఆపరేషన్ గంగ మిషన్‌ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యవేక్షిస్తున్నారు. బుకారెస్ట్ ఎయిర్ పోర్టులో విద్యార్థులను స్వయంగా ఆయనే దగ్గరుండి విమానాన్ని ఎక్కించారు. భారతీయులను తరలించేవరకు ఈ మిషన్ కొనసాగుతుందని తెలిపారు .
రొమేనియా ప్రధానికి కృతజ్ఞతలు
అటు రొమేనియా ప్రధాని నికోలే సియుకాను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సమావేశమైయ్యారు. ఉక్రెయిన్ లో యద్ధ వాతావరణం నేపథ్యంలో భారత పౌరుల భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బుకారెస్ట్ తమ పౌరులను తరలింపును సులభతరం చేశారని మీ సేవలు మరువలేనిమని కొనియాడారు. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సీ 17 విమానం ద్వారా భారతీయులను తలించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడినట్లు విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.












Click it and Unblock the Notifications