టాయ్‌లెట్ వెళ్లి షాకయ్యాడు: బుసలు కొట్టిన కోబ్రా(వీడియో)
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పొల్లాపట్ అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వాష్‌రూమ్(మరుగుదొడ్డి)కు వెళ్లాడు. టాయ్‌లెట్ సీటు మూత తీయగానే అతనికి ఊహించని అనుభవం ఎదురైంది.
ఓ తాచుపాము బుసలు కొడుతూ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. అతని నోటివెంట మాట రాలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపటికి తేరుకున్న అతను వెంటనే మూతను మూసేశాడు.
వెంటనే రెస్క్యూ టీంకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. కాసేపు తంటాలు పడిన రెస్క్యూ టీం.. చివరకు పామును బయటకు తీసింది. ఆ పాము సుమారు రెండు మీటర్ల పొడవు ఉంది. దాని బారినుంచి 'బతికిపోయాను బాబూ' అని అనుకున్నాడు టాయ్‌లెట్‌కు వెళ్లిన ఆ వ్యక్తి. కాగా, స్థానికంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రెండు వారాల్లో ఇది రెండోది.












Click it and Unblock the Notifications