ప్రపంచానికి సవాల్: ఇస్లామిక్ స్టేట్ ఎలా పుట్టింది?

ప్యారిస్: ప్రపంచానికి సవాల్‌గా మారిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఎలా పుట్టిందనేది ఆసక్తికరమైన విషయమే. ఫ్రాన్స్‌లో బీభత్సం సృష్టించిన ఐఎస్ఐఎస్ ఇప్పుడు అమెరికాకు సవాల్ విసురుతోంది. న్యూయార్క్‌పై దాడి చేస్తామని హెచ్చరిస్తోంది. ఐసిస్ ఏ విధమైన దొంగ దెబ్బ తీస్తుందో అర్థం కాక ప్రపంచ దేశాలు గట్టి నిఘాను పెట్టాయి.

ఇరాక్ దేసంలో 1999 సంవత్సరంలో జమాత్ అల్ - తాహిద్ వల్- జిహాద్ అనే పేరుతో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపి అల్-ఖైదా ఇన్ ఇరాన్ అని పేరు మార్చుకుంది. అలా 2003 వరకూ కొనసాగింది. 2003లో ఇరాక్ పైన అమెరికా దాడుల క్రమంలో ఎదురు దాడులు చేసింది.

Terrorism: The birth of ISIS

ఆ తర్వాత 2006లో మరికొన్ని సున్నీ తీవ్రవాద సంస్థలతో కలిసి ముజాహిదీన్ షురా కౌన్సిల్ గా పేరు మార్చుకుంది. కొద్ది రోజుల తర్వాత ఇస్లామిక్ రాజ్యం అనే పేరును ప్రకటించుకుంది. ఆ తర్వాత తన పేరును ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్(ఐఎస్ఐ)గా మార్చుకుంది. ఈ సంస్థకు అబుబకర్ అల్-బాగ్దాదీ నాయకత్వం వహించారు. ఆయన హయాంలో ఉగ్రవాద చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

ఈ పరిస్థితుల్లోనే సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. దాంతో అక్కడ తిష్ట వేసింది. సిరియాలో సున్నీ మెజారిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించింది. 2013లో ఏప్రిల్ నెలలో అక్కడి అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జభాట్ అల్-సుస్రా ఫ్రంటును విలీనం చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)గా పేరును మార్చేసుకుంది.

Terrorism: The birth of ISIS

2014 ఫిబ్రవరి నెల దాకా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. విభేదాల కారణంగా అల్ ఖైదా ఐఎస్ఐఎస్ నుంచి తెగతెంపులు చేసుకుంది. ఐఎస్ఐఎస్ దళాల్లో భారత్ సహా దాదాపు 100 దేశాలకు చెందిన 20 వేల మంది విదేశీ ఫైటర్లు ఉన్నారని ఒక అంచనా.

ఐఎస్ఐఎస్ సంస్థకు 200 కోట్ల డాలర్లుకు పైగా నిధులు కూడా ఉన్నట్లు ఇరాక్ నిఘా విభాగం నిరుడు గుర్తించింది. భారత కరెన్సీలో చూస్తే ఈ నిధులు రూ. 12,000 కోట్లకు పైగానే అవుతుందని. ఇరాక్ దేశంలో ప్రస్తుతం 300 చమురు బావులు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. అంతేకాదు సిరియా చమురు ఉత్పత్తిలో 60 శాతం ఈ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+