దమ్ముంటే రా.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.! గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్‌లో వాటా! : పుతిన్‌కు ఎలన్ మస్క్ సవాల్
ఉక్రెయిన్‌పై రష్యా సేనల దండయాత్ర కొనసాగుతోంది. ఒక్కోక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. నివాససముదాయాలు, ఆస్పత్రులను టార్గెట్ చేస్తూ క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. మౌలిక సదుపాయాలు కొరత ఏర్పడింది. తాగునీరు, ఆహారం సామాగ్రి కొరతతో ప్రజలు అల్లడుతున్నారు. మేరియుపోల్‌లో పరిస్థితులు అంత్యంత దయనీయంగా ఉన్నాయి. రష్యా విధ్యంసకాండతో ఈ నగరంలో ఇప్పటివరకు సుమారు 2,500 మంది మరణించారు.

కీవ్‌లో దాడులు
అటు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయినా ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా దాడులతో ఎటు చూసినా హృదయవిదారకమైనా పరిస్థితులు కన్పిస్తున్నాయి. మాస్కో దళాలను ఎదుర్కోనేందుకు యుద్ధ సామాగ్రిని అందించాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సాయం కోరుతున్నారు. ఐరోపా దేశాలు పుతిన్ చర్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆంక్షలు విధించారు. అయినా వెనక్కి తగ్గకుండా దాడులను రష్యా బలగాలు కొనసాగిస్తున్నాయి.
దమ్ముంటే రా తేల్చుకుందాం..
ఉక్రెయిన్‌పై దాడులను రష్యాలోనే పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దురాక్రమణకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనతో ఫేస్ టు ఫేస్ తలపడాలంటూ సవాల్ విసిరారు . నాతో ఒంటరిగా పోరాడు. ఇదే నీకు నా ఛాలెంజ్ అంటూ మస్క్ ట్విట్ చేశారు.

గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్‌లో వాటా..
ఈపోరులో గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్‌లో వాటా అంటూ ఉక్రెయిన, పుతిన్ పేర్లను ప్రస్తావిస్తూ మస్క్ పోస్ట్ చేశారు. పుతిన్‌కు సవాల్ విసురుతూ ఎలన్ మస్క్ చేసిన ఈ ట్విట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు వీపరీతంగా లైకులు, షేర్లు వస్తున్నాయి. పుతిన్‌కు ట్విటర్ అకౌంట్ లేదు. దీంతో క్రెమ్లిన్ అధికారక ట్విటర్ అకౌంట్ ను ట్యాగ్ చేసి మరీ సవాల్ విసిరారు. త్వరగా బదులు ఇవ్వాలంటూ పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. దీంతో వెంటనే స్పందించిన మస్క్ తన స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా అందించారు. ఇప్పుడు మరోసారి ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సవాల్ విసరడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications