వేలంలో కోట్లు పలికి ఎలాన్ మస్క్- ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఆ ఫొటోలు: టీనేజ్‌లోనే డేటింగ్‌..!!

వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ పట్టుకున్నందంతా బంగారమే అయ్యేట్టుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ టాప్ పొజీషన్‌లో ఉంటాడు ఎలాన్ మస్క్. చివరికి టీనేజ్ ఫొటోలకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. వాటిని కొనుగోలు చేయడానికి జనాలు పోటీ పడ్డారంటే అతనికి ఉన్న పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎలాన్ మస్క్ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ ఈ ఫొటోలను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచారు. ఈ వేలం కొద్దిసేపటి కిందటే ముగిసింది. ఆయన ఫొటోలు 1,65,000 డాలర్లకు అమ్ముడుపోయాయి. జెన్నిఫర్‌తో కలిసి చదువుకుంటున్నప్పటి ఫొటోలు అవి. 1994-95 మధ్యకాలంలో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుకుంటోన్న సమయంలో జెన్నీఫర్‌తో ప్రేమలో పడ్డాడు ఎలాన్ మస్క్. ఆమెతో కొంతకాలం డేటింగ్ చేశారు.

Tesla Chief Elon Musks photos with ex-girlfriend Jennifer Gwynne sold for over $165,000 at auction

యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువు పూర్తయిన తరువాత ఎలాన్ మస్క్- జెన్నీఫర్‌కు దూరం అయ్యాడు. గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయడానికి కాలిఫోర్నియా వెళ్లిపోయాడు. ఆ తరువాత అతనితో పెద్దగా సంబంధాలు లేవని జెన్నీఫర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫాక్స్ 29కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫోన్‌ కన్వర్జేషన్‌ అంటే ఎలాన్‌కు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కూడా కొనసాగించడానికి కూడా ఇష్టపడడని వ్యాఖ్యానించారు.

యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుకుంటోన్న సమయంలో తీసిన ఫొటోలతో పాటు గిఫ్ట్‌గా ఇచ్చిన 14 క్యారెట్ల బంగారు నెక్లెస్‌, ఎలాన్ మస్క్ సంతకం చేసిన గిఫ్ట్ కార్డ్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఆక్షన్‌కు ఉంచారు జెన్నిఫర్. నెక్లెస్‌ 51,008 డాలర్లకు అమ్ముడుపోయిందని, గిఫ్ట్ కార్డ్ 16,643 డాలర్లకు కొనుగోలు చేశారని వివరించారు. ఈ మొత్తాన్నంతటినీ తన సవతి కుమారుడి చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు జెన్నిఫర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+