ఓ కుటుంబాన్ని కాపాడిన సెల్ఫీ స్టిక్(వీడియో)
న్యూయార్క్: సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు ఉపయోగించే సెల్ఫీ స్టిక్ ఓ కుటుంబాన్ని కాపాడింది. సముద్రంలో ఈత కొడుతున్న వారిని ఓ రాకాసి అల మింగబోతుండగా ఆ సెల్పీ స్టిక్ ఆపద్భాంధవుడిలా సాయపడింది.
టెక్సాస్‌కు చెందిన డెర్రిక్ జాన్, ఆయన భార్య, కూతురు ఎరిన్ జాన్(16) కాలక్షేపం కోసం మస్సాచుస్సెట్స్‌లోని సముద్రతీరంలో స్నానం చేసేందుకు దిగారు. వారిలో కూతురు ఎరిన్ చేతిలో కెమెరాను సెల్ఫీ స్టిక్‌కు అమర్చి వీడియో తీస్తుండగా వారి వెనుక నుంచి ఒక్కసారిగా భారీ అల వచ్చి ముంచేసింది.
దీంతో ఎరిన్ తన చేతిలోని సెల్ఫీ స్టిక్‌ను సముద్రంలోకి జారిపోతున్న తల్లిదండ్రులకు అందించి కాపాడింది. ఆ తర్వాత ఆ సెల్ఫీ స్టిక్‌తోనే ఎరిన్ కూడా బయటపడింది. తీరం వెంబడి ఉన్న మరికొందరు వీరికి సాయమందించారు.












Click it and Unblock the Notifications