బైకర్స్ గ్యాంగ్ వార్: 120 తుపాకులు సీజ్ (వీడియో)

టెక్సాస్: బైక్ గ్యాంగ్ ల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయని టెక్సాస్ పోలీసులు అంటున్నారు. విధ్వంసాలు సృష్టించాలని ముందుగానే వారు ప్లాన్ వేసుకుని భారీ సంఖ్యలో మారణాయుధాలు వెంట తీసుకు వచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

గత ఆదివారం టెక్సాస్ నగరంలోని వాకా వద్ద బైక్ గ్యాంగ్ ల మద్య పరస్పరం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పులలో 8 మంది సంఘటనా స్థలంలో, ఒకరు ఆసుపత్రిలో దుర్మరణం చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు.

 Texas gang fight, 120 guns recovered

టెక్సాస్ పోలీసులు కాల్పులు జరిగిన ట్వీన్ పీక్స్ రెస్టారెంట్ పరిసర ప్రాంతాలలో సోదాలు చేశారు. బుధవారం పోలీసులకు ఒకే చోట 120 తుపాకులు చిక్కాయి. అదే విధంగా సుమారు 160 కత్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

టెక్సాస్ పోలీసులు చాలెంజ్ గా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 320 తుపాకులు, వెయ్యికి పైగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని టెక్సాస్ అధికారులు అంటున్నారు. ఐదు బైక్ గ్యాంగ్ ల మధ్య కాల్పులు జరిగాయని, ఆ గ్యాంగ్ ల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+