రోడ్డు పక్కన చెత్త ఏరుతుంటే.. కాళ్లు మొక్కిన బ్యూటీ!

థాయ్‌లాండ్: నెత్తిన కిరీటం, హైహీల్స్‌తో వచ్చిన ఓ పదిహేడేళ్ల బ్యూటీ క్వీన్ రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి, వంగి కాళ్లకు నమస్కరించింది. దీనిని అక్కడే ఉన్న ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

థాయ్‌లాండ్‌లో జరిగిన 'మిస్ అన్ సెన్సార్డ్ న్యూస్ థాయ్‌లాండ్-2015' పేరిట నిర్వహించిన అందాల పోటీల్లో విజయం సాధించిన కనిత్తా మింట్ ఫాసేంజ్... టైటిల్ గెలిచిన అనంతరం నేరుగా రోడ్డుపక్కన చెత్త వేరు చేస్తున్న తన తల్లి వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించింది.

Thai garbage collector gets to keep beauty queen crown despite 'lies'

వీధుల వెంట తిరుగుతూ చెత్తను సేకరించి, దానిని వేరు చేసి రీ సైక్లింగ్‌కి పంపిస్తూ తన తల్లి తనను చదివించిందని కనిత్తా పేర్కొంది. అందాల పోటీకి ముందు తాను కూడా చెత్త సేకరణలో తన తల్లికి సహకరించానని చెప్పింది. అందాల పోటీల్లో విజయం సాధించడంతో టీవీ, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంది.

తనతో తన తల్లిని తీసుకు వెళ్లి మంచి జీవితం ఇవ్వాలనేది తన ఆశయమని చెప్పింది. తన తల్లి అందుకు ఒప్పుకోవడం లేదని, తిండి పెట్టిన వృత్తిని ఓపికున్నంత కాలం చేస్తానని చెబుతోందని ఆ బ్యూటీ క్వీన్ కనిత్తా ఆవేదన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+