కన్నతండ్రే.. ఫేస్‌బుక్ 'లైవ్'లో కూతురిని చంపి.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
థాయ్ లాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వుటిసాన్ వాంగ్ టాలే అనే ఓ వ్యక్తి 11ఏళ్ల తన కుమార్తెను ఉరివేసి చంపడమే గాక, ఆ వీడియోను ఫేస్ బుక్ లో లైవ్ ప్రసారం చేశాడు.
బ్యాంకాక్: కన్న కూతురని కూడా చూడకుండా ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాదు, ఆ తతంగం మొత్తాన్ని ఫేస్‌బుక్ లో లైవ్ ప్రసారం చేశాడు. కుమార్తెకు ఉరివేసి చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
థాయ్ లాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వుటిసాన్ వాంగ్ టాలే అనే ఓ వ్యక్తి 11ఏళ్ల తన కుమార్తెను ఉరివేసి చంపడమే గాక, ఆ వీడియోను ఫేస్ బుక్ లో లైవ్ ప్రసారం చేశాడు. అనంతరం అతను కూడా కుమార్తె పక్కన్నే ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో ఆత్మహత్య వీడియోలు పెట్టారన్న విషయాన్ని గమనించిన ఆ సంస్థ ప్రతినిధులు వాటిని తొలగించారు.

భార్య వదిలేయడం, ఆమె ప్రేమకు దూరమవడం వల్లే తీవ్ర మానసిక వ్యథకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. దీనిపై అతని భార్య జిరానుచ్ స్పందించింది. వుటిసాన్ వాంగ్ టాలేతో ఏడాది పాటు కాపురం సజావుగానే సాగిందని, అయితే తన మాజీ భర్తతో తనకు కలిగిన కొడుకును అతను తరుచుగా కొట్టేవాడని వాపోయింది.
అందువల్లే ఇంటి నుంచి బయటకెళ్లిపోయానని, కూతురిని వదిలిపెట్టి పోవడం పట్ల అనుమానం ఉండేదని, చివరకు అనుకున్నదంతా అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కుమార్తెపై ప్రేమ ఉన్నా.. కేవలం తన మీద కోపంతోనే అతను చిన్నారిని హత్య చేశాడని పేర్కొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications