నా కూతుర్ని పెళ్లాడితే కోట్లు ఇస్తా, ఇవీ లక్షణాలు: ఓ తండ్రి బంపరాఫర్, ఎందుకంటే?
బ్యాంకాక్: చదువు ధ్యాసలో పడి ఓ యువతి పెళ్లికి నిరాకరిస్తోంది. ఆమెను ఎన్నిసార్లు బతిమాలినా పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ తండ్రి.. పెళ్లి చేసుకునే యువకుడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన కూతురును పెళ్లి చేసుకునే వ్యక్తికి 3 లక్షల డాలర్లు ఇస్తామని ప్రకటించాడు. అంటే దాదాపు రూ.2 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.

ఎన్నిసార్లు చెప్పినా పెళ్లికి నో
ఆ తండ్రి థాయ్‌లాండ్‌కి చెందిన ఫార్మ్ ఓనర్, వ్యాపారవేత్త. తన కూతుర్ని పెళ్లి చేసుకునే వారికి నజరానాగానే ఆ మొత్తం ఇస్తానని చెప్పాడు. థాయ్‌లాండ్‌లోని చుంపోన్ ప్రావిన్స్‌కు చెందిన అర్నాన్ రోడ్‌థంగ్ (58) అనే వ్యక్తికి 26 ఏళ్ల కూతురు ఉంది. ఆమె పేరు కర్ణ్‌సిత. ఆమె చదువు ధ్యాసలో పడి పెళ్లికి నో చెబుతోంది. ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి సిద్ధమనడం లేదు. దీంతో తండ్రి ఇలా బహిరంగ ప్రకటన చేశాడు.
కూతురును పెళ్లాడే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు
తన కూతురును పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పాడు. ఆ యువతి చైనీస్, ఇంగ్లీష్ భాషలను మాట్లాడగలదు. ఈమెను చేసుకోబోయేవాడు స్మార్ట్‌గా ఉండకపోయినా పర్వాలేదు కానీ, చదవడం, రాయడం రావాలి. డిగ్రీలు చదువుకున్నవాడే కావాలనిలేదు. కానీ కష్టపడేతత్వం కలిగినవాడు కావాలి. డబ్బుని ప్రేమించకుండా మనుషులని ప్రేమించేవాడు, తన వ్యాపార లావాదేవీల గురించి తెలిసినవాడు కావాలని చెప్పాడు. ఈ లక్షణాలున్న అబ్బాయికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు.
ఆస్తిని వాళ్లకే రాసిస్తా.. కానీ
తన కూతురుకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టమని, ఆమెకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉందని, తనకు మాస్టర్ డిగ్రీలు చేసినవాళ్లు అవసరం లేదని, తన అస్తిని మొత్తం వాళ్లకే రాసిస్తానని, తన కూతురును పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటే చాలునని ఆ తండ్రి చెబుతున్నాడు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications