Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థాయ్‌లాండ్ పొలాల్లో జంబో జెట్.. షాకైన గ్రామస్తులు

మీరు ఉదయాన్నే నిద్రనుంచి లేచి కళ్లు తెరవగానే మీ ముందు ఓ పేద్ద జంబో విమానం ప్రత్యక్షమైతే మీరు షాక్‌కు గురవుతారు... అవునా కాదా..? ఇదే థాయ్‌లాండ్ లోని చాయ్‌నాట్ గ్రామంలో జరిగింది. అక్కడి గ్రామస్తులు నిద్రనుంచి లేవగానే పొలాల్లో వారికి పెద్ద బోయింగ్ విమానం దర్శనమిచ్చింది. ఆకాశంలో మహారాణిగా పిలువబడే ఈ బోయింగ్ విమానం ఈ నెల మొదట్లో పొలాల్లో ల్యాండ్ అయ్యింది. అయితే తలుపులు మాత్రం తెరుచుకోలేదు. లోపల ఏముందో తెలుసుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా విమానం తలుపులు మూసే ఉన్నాయి తప్ప తెరుచుకోలేదని సన్ అనే ప్రధాన పత్రిక వెల్లడించింది.

విమానం చూసిన గ్రామస్తులు దాని దగ్గరకు పరుగులు తీసి ఫోటోలు తీసుకున్నారు. థాయ్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంగా తెలుస్తోంది.అయితే తాము తొలిసారిగా ఇంత పెద్ద విమానం దగ్గరనుంచి చూస్తున్నామని.. ఇప్పటి వరకు విమానం ఎక్కలేదని గ్రామస్తులు తెలిపారు. ఇంధనం అయిపోయి పొలాల్లో ల్యాండ్ అయి ఉండొచ్చని మరికొందరు భావించారు. వారు ఇంకా ఫోటోలు తీసుకుంటుండగా అసలు విషయం తాపీగా చెప్పారు ఆ పొలం యజమాని.

Thai villagers shocked to see a boeing flight in fields

స్థానికంగా జరిగిన వేలంపాటలో ఈ పనిచేయని విమానాన్ని తాను కొనుగోలు చేసినట్లు చెప్పాడు సోమ్చాయ్ ఫుకీఓ అనే ఆ పొలం యజమాని. మరి అంత పెద్ద విమానాన్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారని గ్రామస్తులు సందేహం వ్యక్తం చేశారు. ముందుగా అతిపెద్ద భారీ క్రేన్లతో ముందుగా విమానంను ఎత్తి పెద్ద ట్రాలీ ఉన్న ట్రక్కులోకి ఉంచినట్లు చెప్పారు. ఆ ట్రక్కులోనే ఈ భారీ విహంగాన్ని పొలంలోకి తీసుకొచ్చినట్లు చెప్పాడు. తిరిగి అదే భారీ క్రేన్లతో ఎత్తి పొలంలోని స్టాండ్స్ పైకి దించినట్లు పొలం యజమాని వివరించాడు. మొత్తానికి ఎప్పుడూ చూడని విమానంను దగ్గర నుంచి చూసి గ్రామస్తులు తెగ సంబరపడిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+