భర్త ఫోన్ ఎత్తడం లేదని కొడుకును చంపేందుకు యత్నించిన మహిళ

భర్తపై అనుమానంతోపాటు కోపాన్ని తన కొడుకు మీద చూపించింది థాయ్‌లాండ్‌కు చెందిన నారేమున్ జంపసెర్టు. భర్త ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో కొడుకు ఉరేసి చంపేస్తానని వీడియో తీసి పంపింది.

బ్యాంకాక్: భర్తపై అనుమానంతోపాటు కోపాన్ని తన కొడుకు మీద చూపించింది థాయ్‌లాండ్‌కు చెందిన నారేమున్ జంపసెర్టు. భర్త ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో కొడుకు ఉరేసి చంపేస్తానని వీడియో తీసి పంపింది.

భర్తకు పలుమార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ తీయలేదు. అంతేకాదు భర్త మీద ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్తను ఇంటికి రప్పించేందుకు ప్లాన్ వేసింది. వెంటనే ఇంటికి రాకపోతే ఏడాది వయస్సున్న కొడుకును చంపేస్తానని ఆమె బెదిరించింది.

 Thai woman threatens to HANG TODDLER after husband didn’t take her calls

కొడుకు మెడకు నల్లతాడును కట్టి చంపేస్తానని వీడియో తీసి భర్త ఫోన్‌కు వాట్సాప్‌లో పంపింది.దీంతో భయపడిన భర్త ఆ వీడియోను తన సోదరికి పంపారు. ఆమె పోలీసుల సహయంతో వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.

నీ బాబు బతకాలంటే నీవు త్వరగా ఇంటికి రా, లేకపోతే ఉరేసి చంపేస్తాను అంటూ కోపంగా మాట్లాడుతున్న వీడియో థాయ్ మహిళ ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.

నారేమున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబసమస్యలు, ఆర్థికపరిస్థితులు, భర్త మీద అనుమానంతో తాను క్షణికావేశంలో ఆ రకంగా ప్రవర్తించినట్టు నారేమున్ పోలీసులకు చెప్పారు. నిజానికి తానే చనిపోవాలని నిర్ణయించుకొన్నానని , కానీ, బాబు వంకతో బెదిరించినట్టు చెప్పారామె.అయితే ఈ ఘటనను కుటుంబసమస్యగా భావించి పోలీసులు విడిచిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+