పార్లమెంటులో పోర్న్ చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎంపీ...

సాక్షాత్తు పార్లమెంటులో పోర్న్ చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడో ఎంపీ. ఓవైపు బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంటే... మరోవైపు సదరు ఎంపీ గారు సెల్‌ఫోన్‌లో తలదూర్చి పోర్న్ చిత్రాల్లో మునిగితేలారు. ఆ సమయంలో గ్యాలరీలో ఉన్న రిపోర్టర్స్ కెమెరాలు క్లిక్‌మనిపించడంతో ఈ వ్యవహారం బయటపడింది. బ్యాంకాక్ పార్లమెంటులో బుధవారం(సెప్టెంబర్ 16) ఈ ఘటన చోటు చేసుకుంది.

థాయిలాండ్‌లోని చొన్‌బురి ప్రావిన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఎంపీ పేరు రొన్నతెప్ అనువత్. బుధవారం పార్లమెంట్‌కి హాజరైన ఆయన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా దాదాపు 10 నిమిషాల పాటు సెల్‌ఫోన్‌లో తలదూర్చారు. ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి మరీ అందులో లీనమయ్యారు. అదే సమయంలో గ్యాలరీలో ఉన్న కొంతమంది రిపోర్టర్లు కెమెరాలు క్లిక్‌మనిపించడటంతో ఎంపీ రొన్నతెప్ బాగోతం బయటపడింది.

Thailand MP Caught Looking At Porn On His Phone In Parliament

ఆయన తన సెల్‌ఫోన్‌లో పోర్న్ చిత్రాలు చూస్తున్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈ ఫోటోలు బయటకు లీక్ కావడంతో ఎంపీ రొన్నతెప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయన మాత్రం పొంతన లేని కామెంట్స్ చేసి తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను చూసిన ఆ ఫోటోల్లోని మహిళ ఆర్థిక సాయం కావాలని తనకు మెసేజ్ చేసిందన్నారు. అయితే ఆమె ఏమైనా ప్రమాదంలో ఉందా ఏమిటి అన్నది తెలుసుకునేందుకే ఆమె పంపించిన ఫోటోలను ఓపెన్ చేసి చూశానని చెప్పారు.

ఎవరైనా గ్యాంగ్‌స్టర్స్ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారా అన్న అనుమానంతో ఆ ఫోటోలోని పరిసరాలను గమనిస్తున్నట్లు చెప్పారు. చివరకు ఆమె డబ్బు కావాలని అడగడటంతో ఆ ఫోటోలను డిలీట్ చేసినట్లు చెప్పారు. ఎంపీ రొన్నతెప్ పొంతన లేని సమాధానం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆయన్ను కోరింది. అయితే అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని... అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+