భారత్‌పై తప్పుడు కూతలు కూసి అభాసుపాలు: పాక్ మాజీ రాయబారికి పోర్న్‌స్టార్ కృతజ్ఞతలు!
న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో సామాన్యులపై హింస జరుగుతోందంటూ తప్పుడు కూతలు కూసి అభాసుపాలైన భారత్‌లో పాకిస్థాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు సినీ నటుడు, పోర్న్ స్టార్ జానీ సిన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. జానీ సిన్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు అబ్దుల్ బాసిత్.

అక్కసుతో..
అంతేగాక, జమ్మూకాశ్మీర్ భారత సైనికులు జరిపిన పెల్లెట్ కాల్పుల్లో కాశ్మీర్ యువకుడైన ఇతని కళ్లు పోయాయని వ్యాఖ్యానించారు బాసిత్. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చిపడ్డాయి. ఎప్పుడూ భారత్‌పై అక్కసుతో ఇలా తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్థానీల పనా? అంటూ విరుచుకుపడ్డారు భారత నెటిజన్లు.
తప్పు అని తేల్చిన పాక్ జర్నలిస్టు..
అసలు ఏమీ తెలియకుండానే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేయడం ఏంటని నిలదీశారు. అయితే, అబ్దుల్ బాసిత్ పెట్టిన పోస్టు తప్పు అని పాకిస్థాన్‌కు చెందిన నైలా ఇనయత్ అనే జర్నలిస్టు చెప్పడం గమనార్హం. ఆ తర్వాత మరిన్ని ట్రోల్స్ పెరిగిపోయాయి.

పోర్న్‌స్టార్‌ను కాశ్మీరీ యువకుడంటూ..
జానీ సిన్స్‌ను కాశ్మీర్‌కు చెందిన యూసుఫ్ అంటూ పేర్కొన్నారు అబ్దుల్ బాసిత్. కాశ్మీర్‌లో పెల్లెట్లు ప్రయోగించడంతో అతడు చూపు కోల్పోయాడని వ్యాఖ్యానించాడు. తీవ్రమైన విమర్శలు రావడంతో అప్రమత్తమైన బాసిత్.. ఆ తర్వాత ఆ పోస్టును తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించారు.
అబ్దుల్ బాసిత్‌కు థ్యాంక్సంటూ..
ఈ నేపథ్యంలో తన ఫొటోను వాడుకోవడంపై జానీ సిన్స్ వ్యంగ్యంగా స్పందించాడు. తనకు ఎలాంటి చూపు పోలేదు అని చెప్పుకొచ్చాడు. ‘నా చూపు బాగానే ఉందని, మీ కారణంగా నాకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగింది. మీకు కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించాడు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications