రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు (ఫోటోలు)

నార్త్ వేల్స్: చిన్న ఇల్లు అద్దె తీసుకోవాలంటేనే వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి భారత్‌లో ఉంది. అలాంటిది వందల ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవాలంటే ఇంకెంత ఖర్చు అవుతుందో ఆలోచించండి.

అయితే ఇంగ్లాండ్‌లోని నార్త్ వేల్స్‌ సమీపంలోని లాండుడునోలో 850 ఎకరాల్లో ఉన్న పార్స్ ఫామ్ హౌస్‌ను ఏడాదికి కేవలం ఒక పౌండ్‌కే అద్దెకిస్తామంటోంది ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంధ సంస్ధ. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

గతంలో కూడా ఇలాంటి ఆఫర్లను మనం వినే ఉంటాం. అయితే ఈ ఆఫర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే 850 ఎకరాల ఫామ్ హౌస్‌తో పాటు 500 గొర్రెలను ఏడాదికి ఒక పౌండ్‌(ఒక పౌండ్= 98 రూపాయలు)కు అద్దెకిచ్చేందుకు ఆ స్వచ్చంధ సంస్ధ ముందుకు రావడమే. ఇంగ్లాండ్‌లో సముద్రపు అంచున ఉన్న ఓ ప్రత్యేకమైన స్ధలం గ్రేట్ ఓర్మీ.

ఈ గ్రేట్ ఓర్మీకి అత్యంత సమీపంలో ఉన్న పార్స్‌ ఫామ్‌ను అద్దెకు తీసుకుంటే అందులోని 4 బెడ్‌రూంల ఇల్లుతో పాటు 500 గొర్రెలను ఇస్తారు. ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవడానికి ముందుగా అప్లికేషన్‌ పెట్టుకోవాలి. పర్యావరణం.. ప్రకృతిపై మక్కువ ఉన్నవారిని ఎంపిక చేసి దీనిని అద్దెకు ఇవ్వనున్నట్లు నేషనల్ ట్రస్ట్ పేర్కొంది.

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు


అంతేకాదు ఈ మొత్తం కార్యక్రమానికి 'ఫార్మింగ్ హీరో' అనే ఉపశీర్షికను కూడా పెట్టింది. ఈ ఫామ్‌లో కొన్ని అంతరించిపోతున్న జీవ జాతులు ఉన్నాయి. వాటిని కాపాడే ఉద్దేశంతో ప్రకృతి ప్రేమికులను ఎంపిక చేసి ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకివ్వనున్నట్టు నేషనల్ ట్రస్ట్‌కు చెందిన గ్రీన్ ఉడ్ తెలిపారు.

 రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు


ఎవరైతే ఫార్మింగ్ హీరో ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసురకుంటారో వారే అక్కడి జీవ జాతులను పరిరక్షించాలనే షరతు విధిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ఇక్కడ అద్దెకు ఉండాలనుకు వారికి గతంలో వ్యవసాయం చేసిన అనుభవంతో పాటు గతంలో ప్రకృతిని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ అప్లికేషన్‌ను జూన్‌ 10లోపు సదరు స్వచ్ఛంద సంస్థకు పంపించాలని తెలిపారు.

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు


అభ్యర్ధుల దరఖాస్తులను నేషనల్‌ ట్రస్ట్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్ధులు జులై 5వ తేదీని ఇంటర్యూకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు

రూ. వందకే 850 ఎకరాలు, 500 గొర్రెలు


అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 1965 నుంచి నెప్యూనె కోస్ట్‌లైన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ పార్ ఫామ్ హౌస్‌ని నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. అంతరించిపోతున్న కోస్ట్‌లైన్‌ను పరిరక్షించమే దీని ముఖ్య ఉద్దేశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+