వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ ప్రీపెయిడ్ లావాదేవీలు

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఉగ్రవాదులు వారి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగిస్తున్నారని అక్కడి పోలీసు అధికారులు అంటున్నారు. ప్యారిస్ దాడులలో 130 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు సైతం ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగించారని వెలుగు చూసింది.

ప్యారిస్ దాడులు జరగక ముందు రోజు ఉగ్రవాదులు ప్యారిస్ నగరం శివార్లలో బసచేసిన హొటల్ బిల్లులు, ఇతర ఖర్చులకు ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగించి బిల్లులు చెల్లించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.

యూరప్ దేశాలలో వ్యక్తి పేరు తెలియజేయాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రీపెయిడ్ కార్డులు జారీ చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండితే చాలు ఈ ప్రీపెయిడ్ కార్డులు పొందడానికి అవకాశం ఉంది.

The attackers used an anonymous prepaid card to rent hotel rooms outside Paris.

ఫ్రాన్స్ లో 2008 నుంచి జారీ చేస్తున్న ఈ ప్రీపెయిడ్ కార్డులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. సాధారణంగా వీసా, మాస్టర్ కార్డుల లోగోలతో కూడిన ప్రీపెయిడ్ కార్డులకు బ్యాంకు అకౌంట్ లతో అనుసంధానం ఉంది.

అయితే బ్యాంకింగ్ రంగంలో పోటిని తట్టుకునేందుకు ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే ప్రీపెయిడ్ కార్డు పొందడానికి అధికారులు రంగం సిద్దం చేశారు. అదే విధంగా కావలసినంత సొమ్ము రీచార్జ్ చేసుకుని ఈ కార్డులను విదేశాలలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్యారిస్ లోని హోటల్ లో ఉపయోగించిన ప్రీపెయిడ్ కార్డుల వివరాలు సేకరించిన అధికారులు ఆ కార్డులు ఎవ్వరి పేరుతో ఈ ప్రీపెయిడ్ కార్డులు తీసుకున్నారు అని పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.

English summary
Prepaid payment cards were seen as a positive development, helping those excluded from the banking system and providing a convenient financial tool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X