ఐఎస్ఐఎస్ ఆదీనంలో రామాదీ నగరం
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పురాతన నగరాన్ని తమ ఆదీనంలోకి తీసుకుని మానవ బాంబులు, కారు బాంబు పేలుళ్లు సృష్టిస్తామని హెచ్చరిస్తున్నారు. సిరియాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రమాదీ నగరాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
బాగ్దాద్ కు 115 కిలో మీటర్ల దూరంలో ప్రసిద్ది చెందిన పురాతన రమాదీ నగరం ఉంది. ఆదివారం ఒక్కసారిగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రమాదీ నగరం మీద పడ్డారు. రమాదీ నగరంలోని అధికారిక భవనాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వారి ఆదీనంలోకి తీసుకున్నారు.

అంతకుముందు తీవ్రవాదులు పాల్ మైరా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తరువాత రమాదీ నగరం మీద పడ్డారు. ఇస్లామిక్ రాజ్యం స్థాపిస్తామని చెప్పుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు గత సంవత్సరం సిరియాలో విద్వంసాలు సృష్టించారు.
ఇప్పుడు రమాదీ నగరం మీద పడ్డారని, ఈ నగరాన్ని పూర్తిగా ద్వంసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆన్ బార్ ఆపరేషన్ కమాండ్ ముహున్వాద్ హైమోర్ అంటున్నారు. రమాదీ నగరం ద్వంసం కాకుండ చూడటానికి అక్కడి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. ఇరాక్ సెక్యూరిటి ఫోర్స్ బలగాలను రంగంలోకి దింపారు.












Click it and Unblock the Notifications