Alaska Airlines: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. ఎమర్జేన్సీ ల్యాండింగ్..
విమానం గాల్లో ఉండగా డోర్ ఊడిపోవడంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలో జరిగింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ కో. 737 మ్యాక్స్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డోర్ ఊడిపోవడంతో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ అయింది. ఈ సంఘటన తర్వాత, అలాస్కా ఎయిర్‌లైన్స్ తన బోయింగ్ 737-9 విమానాలన్నింటినీ నిలిపివేసింది.
"ఫ్లైట్ 1282లో ఈ రాత్రి జరిగిన ఈవెంట్‌ను అనుసరించి, మా విమానాల 65 బోయింగ్ 737-9 విమానాలను తాత్కాలికంగా గ్రౌండింగ్ చేసే ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము" అని అలస్కా ఎయిర్‌లైన్స్ CEO బెన్ మినికుచి ఒక ప్రకటనలో పేర్కొంది.
పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి సర్వీస్ ప్రారంభస్తామని తెలిపింది.

ఈ విమానం 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకు బయల్దేరడానికి టేకాఫ్ అయింది. అయితే కాసేపటికే డోర్ ఊడిపోయింది. దీంతో తిరిగి అదే ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండ్ అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అలాస్కా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
Breaking: Alaska airline plane makes an emergency landing at portland, oregon.
— John De Beloved (@Papacy1988) January 6, 2024
After wind blows out in mid air.
Several items, including phones
sucked out of the plane when it suddenly depressurised. Everyone is safe pic.twitter.com/RNhCD0pS5O
"పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియో, CAకి AS1282 బయలుదేరిన వెంటనే ఈ సాయంత్రం ఒక సంఘటన జరిగింది. 171 మంది అతిథులు మరియు 6 మంది సిబ్బందితో విమానం పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా తిరిగి వచ్చింది. మేము ఏమి జరిగిందో పరిశీలిస్తున్నాము. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్నింటిని భాగస్వామ్యం చేస్తాము" అని ఎయిర్‌లైన్ X ప్లాట్‌ఫారమ్‌లో తెలిపింది.
విమానంలో గాల్లోకి వెళ్లిన దాదాపు 20 నిమిషాల తర్వాత.. విమానం 16,300 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగింది.సరికొత్త బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అక్టోబరులో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ అయింది.












Click it and Unblock the Notifications