దుబాయ్ బీచ్ లో ఫ్రీ ఇంటర్నెట్ లు, చెట్లు అదుర్స్
దుబాయ్: వివిద దేశాల పర్యాటకులను ఆకట్టుకొవడానికి దుబాయ్ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నది. దుబాయ్ లోని బీచ్ లలో ఎక్కడైనా సరే వై-పై ఇంటర్నెట్ ను ఉచితంగా అందించడానికి సకలసదుపాయాలు కల్పించారు. దుబాయ్ మునిసిపాలిటి ఈ సరికొత్త ప్లాన్ ను అమలులోకి తీసుకు వచ్చింది.
దుబాయ్ మునిసిపాలిటికి చెందిన స్మార్ట్ పామ్ సోలార్ టెక్ హబ్ ప్రాజెక్టులో భాగంగా కృత్రిమంగా తయారు చేసిన తాడి, కర్జూరం చెట్ల నుండి పర్యాటకులకు వై-పై ఇంటర్నెట్ అందే విదంగా ఎర్పాట్లు చేశారు. దుబాయ్ లోని బీచ్ లు, పార్క్ ల దగ్గర ఈ తాడి, కర్జూరం చెట్లు ఎర్పాటు చేశారు.
SMART PALM Launch Event - Zabeel Park Gate 6 pic.twitter.com/dmnXXOfkY1
— ZORAN SAVIC (@zoransavic_bcn) April 22, 2015 వై-పై ఇంటర్నెట్ తో పాటు స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్లు చార్జింగ్ చేసుకోవడానికి చార్జింగ్ పాయింట్లు అమర్చారు. అంతే కాకుండ ఈ తాడి చెట్లకు లౌడ్ స్పీకర్లు ఎర్పాటు చేశారు. బీచ్ లో ప్రకృతి వాతావరణం ఎలా ఉందని అని ఎప్పటికప్పుడు వీటికి ఎర్పాటు చేసిన సిగ్నల్స్ పసిగడుతాయి.
పర్యాటకుల క్షేమం దృష్టిలో పెట్టుకుని వీటిని ఎర్పాటు చేశామని దుబాయ్ పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. బీచ్ లలో ప్రకృతి వాతావరణం అనుకూలించని సమయంలో ఈ చెట్లకు ఎర్పాటు చేసిన సైరన్ లు మోగుతాయని, అప్పుడు పర్యాటకులు క్షేమంగా ఒడ్డుకు చేరుకొవచ్చని అంటున్నారు.
"Smart Palm" to provide free WIFI in #Dubai parks. http://t.co/FSqR9L6UUL pic.twitter.com/61QMsw2CUB
— UAE BARQ (@UAE_BARQ_EN) April 23, 2015 అచ్చం చెట్టు రూంలో తయారు చేసిన ఈ ‘‘ టెక్ హబ్ '' ఖర్జూరం చెట్టు, తాడి చెట్టు ఆకారంలో ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి కావాలసినంత విద్యుత్ సోలార్ ద్వారానే సమకూరుతుంది. ఒక్కోక్క చెట్టుకు 12 ప్లగ్ పాయింట్ లు ఉంటాయి. 12 పరికరాలు చార్జ్ చేసుకునే అవకాశం ఉంది.
దుబాయ్ లో ఎర్పాటు చేసిన ఈ సరికొత్త ప్రాజెక్ట్ కు మంచి స్పందన వస్తున్నదని, త్వరలో దుబాయ్ మొత్తం ఉన్న బీచ్ లు, పార్క్ లు, రోడ్ల పక్కన వాటిని ఎర్పాటు చేస్తామని దుబాయ్ మునిసిపాలిటి డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ అంటున్నారు.












Click it and Unblock the Notifications