Asiana Airlines: విమానం గాల్లో ఉండగానే ఓపెన్ అయిన అత్యవసర ద్వారం.. 12 మందికి గాయాలు..

గురువారం 160 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాక్సీవే నుంచి రన్‌వేలోకి ప్రవేశించి టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొట్టింది. పక్షి విమాన రెక్కలను బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే వెంటనే పైలట్ ఏటీసీ సమాచారం ఇచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

తాజాగా దక్షిణ కొరియాలో ఓ విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడంతో గాలి వేగంగా విమానంలోకి వచ్చింది. శుక్రవారం ఆసియానా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321 విమానం 194 మందితో జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి వెళ్తోంది. అందులో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తలుపు తెరిచాడు.

The emergency door opened while the Asiana Airlines flight was in the air in South Korea

ఈ ఘటనలో అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి, అయితే విమానం దక్షిణ కొరియాలోని డెయగూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తలుపు తెరిచిన 30 ఏళ్ల వ్యక్తిని విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను డోర్ తెరుస్తుండా, తెరిచిన తర్వాత విమానంలో కొందరు ప్రయాణికులు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఆ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ ను ఎందుకు ఓపెన్ చేశాడో తెలియరాలేదు. అతను అత్యవసర ద్వారం తెరుస్తుండగా అందులో తోటి ప్రయాణుకులు అడ్డుకున్నారు. కానీ అప్పటికే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయినట్లు అధికారులు తెలిపారు. "తలుపుకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా మూర్ఛపోయినట్లు కనిపించింది. ఫ్లైట్ అటెండెంట్‌లు బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా విమానంలో ఉన్న వైద్యులను పిలవడం గందరగోళంగా ఉంది" అని 44 ఏళ్ల ప్రయాణికుడు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+