ఏప్రిల్ ఫూల్ కాదురా సామీ! లారీ చాక్లెట్లు లేపేశారు.. ఏం జరిగిందంటే?

"హావ్ ఏ బ్రేక్.. హావ్ ఏ కిట్‌క్యాట్" - ఈ పాపులర్ ట్యాగ్‌లైన్‌ను ఎవరో దొంగలు మరీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు! ఏకంగా 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లను లారీతో సహా లేపేసి నెస్లే సంస్థకు కోలుకోలేని 'బ్రేక్' ఇచ్చారు. సరిగ్గా ఏప్రిల్ 1వ తేదీన ఈ వార్త బయటకు రావడంతో ఇదంతా ఏదో 'ఏప్రిల్ ఫూల్స్' ప్రాంక్ అని అందరూ నవ్వుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇది జోక్ కాదు, మార్చి 30న జరిగిన పక్కా ప్లాన్డ్ దొంగతనం అని నెస్లే స్వయంగా ప్రకటించడంతో ప్రపంచం నివ్వెరపోయింది.

యూరప్‌లోని తయారీ కేంద్రం నుంచి పంపిణీ కేంద్రానికి వెళ్తున్న ట్రక్కు దారిలోనే అదృశ్యమైంది. అందులో సుమారు 4,13,793 కిట్‌క్యాట్ బార్లు ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా కోట్లలో ఉంటుంది. ఈ చోరీపై నెస్లే ప్రతినిధి స్పందిస్తూ.. "మేము కిట్‌క్యాట్‌తో బ్రేక్ తీసుకోమని చెబుతాం కానీ, దొంగలు ఏకంగా 12 టన్నుల సరుకుతో విరామం తీసుకుంటారని ఊహించలేదు" అంటూ చమత్కరించినప్పటికీ, లోలోపల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, నిజంగానే సరుకు చోరీకి గురైందని కంపెనీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.

The Great KitKat Robbery 12 Tons of Chocolate Stolen Nestle Warns Public to Check Batch Codes

రంగంలోకి 'స్టోలెన్ కిట్‌క్యాట్ ట్రాకర్'!

చోరికి గురైన చాక్లెట్లు బ్లాక్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకునేందుకు నెస్లే ఒక వినూత్న ప్లాన్ వేసింది. "స్టోలెన్ కిట్‌క్యాట్ ట్రాకర్" పేరుతో ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. వినియోగదారులు తాము కొన్న చాక్లెట్ వెనుక ఉన్న 8 అంకెల 'బ్యాచ్ కోడ్'ను ఇందులో ఎంటర్ చేయడం ద్వారా.. అది దొంగిలించబడిన సరుకో కాదో తెలుసుకోవచ్చు. రిటైలర్లు కూడా ఈ సరుకును గుర్తించి కంపెనీకి సమాచారం ఇవ్వాలని నెస్లే కోరింది.

నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్.. ట్రంప్ దాకా వెళ్ళిన సెటైర్లు!

ఈ వార్త సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక యూజర్ "నేను ఈ చాక్లెట్లను వెతికి పెడితే నాకు రోజుకు 1000 డాలర్లతో పాటు ఒక బాక్స్ కిట్‌క్యాట్ ఇవ్వాలి" అని డిమాండ్ చేయగా.. మరొకరు ఏకంగా "డొనాల్డ్ ట్రంప్ గారు.. దయచేసి ఈ భారీ దొంగతనంపై దర్యాప్తు చేయండి" అంటూ ట్యాగ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ 12 టన్నుల చాక్లెట్లు ఏ దేశంలో ఉన్నాయో, దొంగలు వీటిని ఏం చేస్తారో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మిస్టరీగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+