బిగ్ బ్యాంగ్ థియరీ: 'హిగ్స్ బోసన్' దైవకణం కాదేమో!

లండన్: దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని ఈ రేణువును స్విట్జర్లాండులోని ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్)కు చెందిన బిగ్ బ్యాంగ్ యంత్రంలో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గత ఏడాది వెల్లడించారు. దీంతో, అప్పటి వరకు సైద్ధాంతికంగానే ఉన్న దాని ఉనికిని తొలిసారిగా నిర్ణయించినట్లయింది. అయితే, తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బృందం దీనిపై అనుమానాలు వ్యక్తం చేసింది.

సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

హాడ్రన్ కొలైడర్ ప్రయోగంలో తాము కనిపెట్టింది దైవ కణమేనని, అదే ఈ సమస్త జగతికి మూలమని సెర్న్ శాస్తవ్రేత్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన వివరాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. సెర్న్ ప్రయోగంలో శాస్తవ్రేత్తలు ఓ కొత్త కణాన్ని కనిపెట్టారే తప్ప అది ఈ సృష్టికి మూలమైన దైవకణం మాత్రం కాదని అంతర్జాతీయంగా ఈ అంశంపై అధ్యయనం చేసిన ఈ పరిశోధక బృందం తెలిపింది.

The Higgs Boson God Particle may still be Undiscovered

కొలైడర్ పరీక్షలో భాగంగా వెలుగులోకి వచ్చిన అనేక అంశాలను ఈ తాజా బృందం కూలంకషంగా విశ్లేషించింది. ఈ ప్రాతిపదికన గత ఏడాది వెలుగులోకొచ్చిన కణం దైవకణమేనని కచ్చితంగా చెప్పలేమని, ఇది కూడా ఒక రకమైన కణం కావొచ్చని వెల్లడించారు.

హాడ్రన్ ప్రయోగంలో వెల్లడైన వివరాలు స్పష్టంగా నిర్దుష్టంగా లేని కారణంగా ఈ రకమైన సందేహాలకు ఆస్కారం ఏర్పడుతోందని సదరన్ డెన్మార్క్ యూనివర్శిటీకి చెందిన సహాయ ప్రొఫెసర్ మాట్స్ టౌడల్ ఫ్రాడ్సన్ తెలిపారు. తాము సెర్న్ ప్రయోగాన్ని కొట్టిపారేయడం లేదని, వారు కనిపెట్టింది కచ్చితంగా దైవకణమేనని చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు.

ఇది సాంకేతికంగా ఒక రకమైన హిగ్స్ కణం కావొచ్చని దాదాపుగా హిగ్స్ బోసన్‌కు, దీనికి మధ్య ఎంతో సారూప్యం ఉంటుందని వెల్లడించారు. అందుకే దీన్ని టెక్ని- హిక్స్‌గా పేర్కొంటున్నట్లు ఫ్రాడ్సన్ తెలిపారు. ఈ రెండు కణాల మధ్య ప్రయోగాల్లో కూడా కొంత గందరగోళం చోటుచేసుకుంటుందని, అందుకు కారణం వీటిమధ్య అంత విస్తృతమైన సారూప్యత ఉండటమేనని తెలిపారు. ఈ రెండు కణాలు కూడా ఈ విశ్వం ఎలా ఏర్పడిందన్న దానికి సంబంధించిన భిన్న సిద్ధాంతాలకు చెందినవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+