Snakes: కొత్త ఇంట్లోకి రాగానే షాక్.. ఇంటి గోడల్లో 40 పైగా పాములు..

సాధారణంగా ఒక్క పామును చూస్తేనే భయపడి పరుగులు తీస్తాం. అలాంటి ఒకేసారి పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే ఇంకేముంది గుండె ఆగిపోతుంది. కానీ ఓ ఇంట్లో పదుల సంఖ్యలో భారీగా పాములు కనిపించాయి. అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్‌ హాల్‌.

ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్‌ మదర్‌ కావడంతో ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంది. డెన్వర్ డౌన్‌టౌన్‌కు ఆగ్నేయంగా 15 మైళ్ల దూరంలో ఉన్న సెంటెనియల్‌లోని తన కొత్త నాలుగు పడకల, రెండు స్నానపు ఇంటిని కొనుగోలు చేసింది.

The home owner was shocked to find a large number of snakes in his newly purchased house in America

ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని ఇంటికి వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్‌ కుక్కలు కూడా తీసుకొచ్చుకుంది. ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. వెళ్లి చూసేసరికి ఆమె పాము కనిపించింది. కాస్త ముందుకు వెళ్లగానే మరో పాము కనిపించింది. దీంతో ఆమె స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి ఇంటి గోడలల్లో డజను పాములను పట్టుకున్నారు.

"నేను ఇక్కడ సమాన్లు సద్దుతున్నాను. నా కుక్కలలో ఒకటి వంగిపోయి ఈ మూలకు చాలా నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. నేను కుక్క వెంట వెళ్లాను అక్కడ పాము గోడపైకి జారడం చూశాను" ఆ తర్వాత మరిన్ని పాములు కనిపించాయి" అంబర్ హాల్ చెప్పారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు.

ఎన్ని కష్టలొచ్చినా కష్టపడి కొనుక్కున్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. "నా పిల్లలు మరియు నేను మా పడకలలో పడుకోవడానికి భయపడుతున్నాము.మరుగుదొడ్ల నుండి పాములు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడానికి భయపడుతున్నాము" అని ఆవేదన వ్యక్తం చేశారు.

పాములు పట్టేందుకు తాను $1,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు అంబర్ హాల్ తెలిపారు. "నా కోసం కొన్ని పాములను పట్టుకున్న స్నేక్ రాంగ్లర్, పట్టుకున్న పాములు దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వయస్సు గలవని అతను చెప్పాడు, కాబట్టి అవి చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాయని, ఇంకా చాలా ఉన్నాయని అతను ఊహించాడు" అని హాల్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+