Spider Nesting: చెవిలో సాలీడు గూడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా సాలీడులు ఇంట్లో మూలల్లో గూడు కట్టుకుని ఉంటాయి. లేదా చెట్లపై కూడా గూడు కట్టుకుంటాయి. కానీ ఓ చోట మనిషి చెవిలో సాలీడు గూడు కట్టుకుంది. ఈ ఘటన చైనాలో జరిగింది. చైనాకు చెందిన ఒక మహిళ టిన్నిటస్ (రింగింగ్ సౌండ్ వినడం), చెవిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. ఆమె పరీక్షించిన వైద్యుడు షాక్ గురయ్యాడు. బాధితురాలి చెవిలో సాలీడు గూడు కట్టడంతో పాటు కుటుంబాన్ని కూడా పోషిస్తుందని గుర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది.
ఏప్రిల్ 20న సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. డాక్టర్ మహిళ చెవిలో ఎండోస్కోపీ చేయగా సాలీడు కనిపించింది. వైద్యుడు సాలీడును బంధించిన ప్రక్రియ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో వైద్యుడు ఒక కర్ణభేరిని లాగుతున్నట్లు కాని అతను సాలీడుచే అల్లిన సిల్కీ వెబ్ బయటకు లాగాడు. హుయిడాంగ్ కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో కెమెరాతో అమర్చిన ప్రత్యేక ట్వీజర్‌లతో మహిళ కుడి చెవిలో ఎండోస్కోపీ చేసి సాలీడుతో పాటు దాని గూడును బయటకు లాగారు.

సాలీడు అల్లిన ఈ గూడును తొలగించిన తర్వాత దాని వెనక ఓ సాలీడు నివాసం ఉండటంమే కాకుండా ఓ కుటుంబాన్ని పెంచుకున్నట్లు తేలింది. పరీక్ష సమయంలో ఎండోస్కోపిక్ ట్యూబ్ పై సాలీడు దాడి కూడా చేసింది. సాలీడు తయారు చేసుకున్న గూడు కర్ణభేరిని పోలీ ఉంది. దగ్గరగా వెళ్లి చూస్తేనే అది ఓ సాలీడు గూడు అని తేలింది. సాలీడును బయటకు తీసే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిందని వైద్యుడు తెలిపాడు.
ఇది విషపూరిత సాలీడు కాకపోవడం అదృష్టమని, స్పైడర్ వల్ల మహిళ చెవి స్వల్పంగా దెబ్బతిందని ఆయన చెప్పారు. టిన్నిటస్ గురించి మహిళ ఫిర్యాదును విన్న వైద్యులు, వింత శబ్దాలు, నొప్పి మరేదైనా కారణంగా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. అందుకే ఎండోస్కోపి చేశారు.












Click it and Unblock the Notifications