సిరియాలో వేలుపెట్టారు: దాడి చేశాం; ఐఎస్(వీడియో)
ప్యారిస్: ప్యారిస్ లో దాడులు చేసింది తామే అని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. అనవసరంగా తమతో పెట్టుకున్నారని, మీకు తగిన బుద్ది చెప్పడానికే ఈ దాడులు చేస్తున్నామని ఉగ్రవాదులు చెప్పారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ప్యాన్స్ అధ్యక్షుడు హోలండ్ సిరియా విషయంలో జోక్యం చేసుకున్నాడు, అతను చేసిన తప్పుకు ప్యాన్స్ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు, అసలు హోలండ్ సిరియా విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడని ఉగ్రవాది ప్రశ్నించాడని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

ఈ విషయాలు ద బట్లాకాన్ అనే సంగీత వేదిక వద్ద ఉగ్రవాది మాట్లాడుతున్న సమయంలో తాను విన్నానని పియోర్ జనాస్జక్ అనే రేడియో ప్రెజెంటర్ తెలిపారు. అంతే కాకుండ ఉగ్రవాదులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
అయితే ఉగ్రవాదులు మొదట ఎందుకు దాడులు చేశారు అనే విషయం తెలియడం లేదని ప్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ అన్నారు. ఇప్పుడు కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేశారని హోలండ్ కచ్చితంగా చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications