పరువు తీసిన ‘హెడ్ సెట్స్’ గానామృతం

ఆమ్ స్టర్ డ్యామ్: చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు పాడుతుంటే వినేవాళ్లకు కర్ణకఠోరంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇలా పాటలు పాడుతున్న వ్యక్తి గొంతు విన్న ఇరుగుపొరుగువారు ఇంట్లో గృహహింస జరుగుతున్నదని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ అపార్ట్ ముంట్ వాసులకు మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ఓ భయంకరమైన గొంతు వినిపించింది. ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని క్షుణ్ణంగా పరిశీలించారు.

అదే అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ నుంచి అరుపులు వస్తున్నాయని గుర్తించారు. ఆ ఫ్లాట్ లో గృహహింస జరుగుతున్నదని భావించి పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు తియ్యాలని చెప్పారు.

The man was singing along to an opera

అయితే ఆ వ్యక్తి మాత్రం హెడ్ ఫోన్స్ తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుతున్నాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయినా అతను పాటలు పాడటం నిలపలేదు. ఈ సీన్ చూసిన పోలీసులు షాక్ కు గురైనారు.

తరువాత పోలీసులను గుర్తించిన ఆ వ్యక్తి ఏమి జరిగింది అని అడిగాడు. జరిగిన విషయం తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. అయితే ఇంటిలో గృహహింస జరగలేదని, అతని మీద గతంలో ఎలాంటి కేసులు, ఫిర్యాదులు లేవని తెలుసుకున్న పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అతని ఇంటి తలుపు పగలగొట్టిన పోలీసులు ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+