Valentine's Day 2025: వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ ఎవరో తెలుసా..?
ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకొంటారు. ఈ రోజును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే మీకు ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడు ఎవరో తెలుసా..? ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసా..? అయితే మీకు ఈ స్టోరీ తెలియాల్సిందే. ఈయన పేరు గియాకోమో కసనోవా. 1725 ఏప్రిల్ 2న ఇటలీలోని వెనీస్ లో జన్మించారు. కసనోవాను అందరూ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అంటారు. కసనోవా తల్లిదండ్రులు థియేటర్ ఆర్టిస్ట్ లు.
11 ఏళ్ల వయసులోనే..
కసనోవా 11 ఏళ్ల వయసులోనే ఆయన లవ్ చేయడం ప్రారంభించారు. ఆయన 13 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్లు తన జీవితకథలో రాశారు. కసనోవా డాక్టర్ కావాలని అనుకున్నాడట. అంతేకాక పూజారి కావాలని కూడా కోరుకున్నాడట. ఆయనకు న్యాయశాస్త్రంపైనా పట్టు ఉన్నట్లు పేర్కొన్నాడు. బీబీసీ రిపోర్టు ప్రకారం ఆయన మేథమేటిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ చదివాడు. కసనోవా తన మొదటి ఉద్యోగం చర్చిలో చేశారు. కసనోవా చర్చిలో పోప్ పర్మిషన్ తీసుకుని నిషేధించిన పుస్తకాలు కూడా చదివాడట.

ప్రేమలో సైలెన్స్ వద్దు..
తన ఆటోబయోగ్రఫీ పేరు "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లో ప్రేమకు సంబంధించి అనేక విషయాలను రాశారు కసనోవా. ప్రేమలో పడితే దాన్ని వ్యక్తపరచాలని .. సైలెంట్ గా ప్రేమ వ్యర్థం అవుతుందని చెప్పారు. కసనోవా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పై మహిళా అధికారులకు ప్రేమ లేఖలు రాసేవారట. వారిని తన మాటలు, కవిత్వంతో ప్రేమలో పడేసి.. వాళ్లతో ట్రిప్ కు వెళ్లేవారట.
కసనోవా తన జీవిత కాలంలో 13 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 200 మందికి పైగా మహిళలతో ప్రేమాయణం నడిపాడట. 200 మందికి పైగా మహిళలతో అఫైర్స్ పెట్టుకున్నాడట. తన మాటలు, కవిత్వంతో 17వ శతాబ్దంలో ఎంతోమంది సుందరాంగిమణులను ప్రేమలోకి దించినట్లు తన ఆటోబయోగ్రఫీలో కసనోవా పేర్కొన్నాడట. ఇదే కసనోవా ప్రత్యేకత అని ఇటలీలో ఇప్పటికీ మాట్లాడుకుంటారని.. ఆయన జీవిత కథను పోటీపడి ప్రేమికులు చదువుతారని పరిశోధనలో తేలింది. అయితే మరికొంతమంది చరిత్రకారులు మాత్రం కసనోవా మహిళలకు బానిసయ్యాడని ఆయనొక ఉమెనైజర్ అని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications