వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాప్తికి కారణమైన వ్యక్తికి అయిదేళ్ల జైలు శిక్ష - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కోవిడ్ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమైన ఓ వ్యక్తికి వియత్నాంలో అయిదేళ్ల జైలు శిక్ష విధించారు.

corona

వియత్నాంకు చెందిన 'లీ వేన్ ట్రీ' వల్ల 8 మందికి కోవిడ్ సోకిందని, వారిలో ఒకరు మరణించారని కోర్టు నిర్ధరణకు వచ్చింది.

కొద్దినెలల కిందట వరకు కరోనావైరస్ వ్యాప్తిని వియత్నాం సమర్థంగా నియంత్రించింది. అయితే, ఈ ఏడాది జూన్ తరువాత డెల్టా వేరియంట్ అక్కడ విజృంభించింది.

వియత్నాంలో ఇప్పటివరకు 5,30,000 పాజిటివ్ కేసులు, 13,300 మరణాలు నమోదు కాగా అందులో అత్యధికం గత రెండు మూడు నెలల్లో నమోదైనవే.

ఎక్కువగా హో చి మిన్ సిటీలో కోవిడ్ తీవ్రత ఉంది.

28 ఏళ్ల 'లీ వేన్ ట్రీ' జులైలో హో చి మిన్ సిటీ నుంచి తన సొంతూరు 'కా మావూ'కు మోటార్‌సైకిల్ మీద వెళ్లారు.

అయితే, 'కా మావూ'లో హెల్త్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తన ట్రావెల్ హిస్టరీ గురించి ఆయన అబద్ధం చెప్పారు. అంతేకాదు, ఐసోలేషన్ నియమాలు కూడా పాటించలేదు.

ఇతర ప్రాంతాల నుంచి కా మావూ వచ్చేవారు ఎవరైనా సరే కనీసం 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని అప్పటికి అక్కడ ఆదేశాలున్నాయి. కానీ, లీ వేన్ అది పాటించలేదు.

ఆ తరువాత లీ వేన్‌కి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన సందర్శించిన ఓ వెల్ఫేర్ సెంటర్ సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది.

ఈ కేసు విచారించిన న్యాయస్థానం లీ వేన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు 880 డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 64 వేలు) జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
The man who was the reason for the spread of Covid sentenced five years Jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X