కిమ్ జాంగ్ ‘మాస్టర్ మైండ్’.. ఈయనే! ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలన్నీ ఈయన కనుసన్నల్లోనే!

ఉత్తరకొరియా కిమ్ జాంగ్ ఉన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలిసిపోయింది. ఇన్నాళ్లూ కిమ్ జాంగ్ చేపట్టిన క్షిపణి పరీక్షలు, మొన్నటి హైడ్రోజన్ బాంబు తయారీ, పరీక్ష కూడా ఈయన కనుసన్నల్లోనే జరిగాయట.

ప్యాంగ్ యాంగ్: ప్రపంచమంతా ఇప్పుడు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ గురించే మాట్లడుకుంటోందనడంతో ఏమాత్రం సందేహం లేదు. కిమ్‌జాంగ్ వల్ల, ఆయన చేసే అణ్వస్త్ర పరీక్షల వల్ల ఎప్పుడు ఏ ఆపద పొంచి ఉందో ఆయా దేశాలు అంచనా వేసుకుంటున్నాయి. ఇటు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ నుంచి అటు చైనా, రష్యా, ఆస్ట్రేలియా, చివరకు భారత్ కూడా ఉత్తర కొరియా చేస్తున్న అణ్వస్త్ర పరీక్షలను ఖండించాయి.

ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు ఆంక్షలు విధించాలని అమెరికా యత్నిస్తుండగా, ఆంక్షలకు తాము వ్యతిరేకమని రష్యా, చైనా వంటి దేశాలు కుండబద్దలుకొడుతున్నాయి. కిమ్‌జాంగ్ గురించి ఇతరదేశాలు ఇంతగా చర్చించడానికి, రచ్చకెక్కడానికి ప్రధాన కారణం.. ఇటీవల ఆయన చేసిన హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతం అవడమే.

kim-jong-sik

అయితే, అణ్వస్త్ర పరీక్షలు చేయమని అధికారులకు ఆదేశాలిచ్చినా సరైన టెక్నాలజీ, గొప్ప శాస్త్రవేత్తలు లేకుంటే కిమ్‌జాంగ్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగేది కాదు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందన్నట్లు.. ప్రతి పాలకుడి విజయం వెనక సమర్ధవంతమైన అధికారులు ఉంటారు. అణ్వస్త్ర పరీక్షల్లో కిమ్‌జాంగ్ విజయం వెనక కూడా ఓ గొప్ప శాస్త్రవేత్త ఉన్నారు.

ఆదివారం జరిగిన హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతంలో కూడా ఆయన పాత్ర అసమానం. హైడ్రోజన్ బాంబును పరీక్షించి విజయవంతం అవడంతో.. ఆనందంలో ఉన్న కిమ్‌జాంగ్.. ఈ విజయానికి ప్రధాన కారణమైన కిమ్‌జాంగ్ సిక్ అనే 50 ఏళ్ల వయసున్న శాస్త్రవేత్తకు అరుదైన సత్కారం ఇవ్వాలని నిర్ణయించారు. తన తండ్రి కిమ్‌జాంగ్ ఇల్ పేరుతో ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారానికి శాస్త్రవేత్తను ఎంపిక చేసి ఆయన సత్కరించారు.

తన ఆగర్భ శత్రువులైన దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు తమను చూసి భయపడేలా చేయడంలో కిమ్‌జాంగ్ సిక్ పాత్ర ఎంతో ఉందని, ఆయుధ పరీక్షలకు ఆయన పెట్టింది పేరని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు. ప్రపంచమంతా కిమ్‌జాంగ్ ఉన్ నామస్మరణ జరుగుతోంటే.. ఉత్తర కొరియాలో మాత్రం శాస్త్రవేత్త కిమ్‌జాంగ్ సిక్ పేరు మారుమోగిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+