మిస్ యూనివర్స్ మీరు కాదు ఈమె: రియల్లీ సారి

లాస్ వేగాస్: మిస్ యూనివర్స్ పోటీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పొరపాటున విజేత పేరు మార్చేసి ప్రకటించేశారు. తానే విజేత అని సంతోషంలో ఉన్న ఆమె క్షణాలల్లో తనకు ఇచ్చిన కిరీటాన్ని మరొకరికి ఇచ్చేశారు.

ఆదివారం రాత్రి మిస్ యూనివర్స్ అవార్డు ప్రకటించారు. చివరిగా పోటీలో అమెరికా, ఫిలిపైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటిలో నిలిచారు. రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన వేదిక మీద మిస్ యూనివర్స్ టైటిల్ ప్రధానం చెయ్యడానికి సర్వం సిద్దం అయ్యింది.

ముగ్గురు యువతులతో పాటు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎవరు విజేత అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే నిర్వహకులు స్టేజ్ మీదకు వచ్చారు. కొలంబియా యువతి గుటిరేజ్ మిస్ యూనివర్స్ అని ప్రకటించారు. గుటిరేజ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

The Miss Universe contestant from the Philippines is this year's winner

నిర్వహకులు ఆమెకు కిరీటాన్ని తొడిగారు. తాను మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నానని గుటిరేజ్ సంతోషంలో మునిగిపోయింది. అంతే అంతలోనే నిర్వహకులు పెద్ద షాక్ ఇచ్చారు. వి ఆర్ రియల్లీ సారీ అంటూ గుటిరేజ్ కు చెప్పారు.

మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది మీరు కాదని ఫిలిఫ్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని చెప్పారు. అంతే గుటిరేజ్ సంతోషం ఆవిరిఅయిపోయింది. ఆమె తల మీద ఉన్న కిరీటం వెనక్కి తీసుకుని ఉర్జ్ బ్యాక్ తల మీద పెట్టారు.

అయితే కార్యక్రమానికి హాజరైన వారు ఈ విషయంలో షాక్ కు గురైనారు. నిర్వహకుల తప్పిదంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంపై కిరీటం చేజారిపోయిన గుటిరేజ్ మాట్లాడుతూ నిర్వహకులు కావాలని ఇలా చెయ్యలేదని, పొరపాటు జరిగిందని, తను బాధపడట్లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+