వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్యాటకులకు హెచ్చరిక: ఈ దేశాల్లో పర్యటన అత్యంత ప్రమాదకరం..

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్, దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పర్యాటకులకు అత్యంత ప్రతికూల పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎఫ్.సీ.ఓ వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విదేశీయులపై దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యాటకులు సైతం అప్రమత్తంగా ఉండేలా చర్యలు మొదలయ్యాయి. దీంతో పర్యాటకులకు అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే దేశాలను ముందే తెలుసుకోవడానికి వెసులుబాటు కలుగుతోంది.

దాడులు, కిడ్నాప్ లు, స్థానికంగా నెలకొన్న శాంతి భద్రతలు, విపత్తులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎఫ్.సీ.ఓ(ద ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్) పర్యాటకులకు ప్రమాదకరంగా ఉండే దేశాల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల దీనికి సంబంధించి తాజా జాబితాను విడుదల చేసింది.

The most dangerous countries to visit in the world

జాబితాలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్, దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పర్యాటకులకు అత్యంత ప్రతికూల పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎఫ్.సీ.ఓ వెల్లడించింది.

ఈ దేశాలతో పాటు మరో 32దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పర్యాటకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించింది. ఆ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈజిప్ట్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్, మాలి, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు ఉన్నాయి.

English summary
The results of an inquest into the killing of 38 holiday makers in Sousse two years ago at the hands of terrorist Seifedine Rezgui has once more brought into sharp focus the dangers tourists can face when travelling to countries where there are potential threats of terrorism or unrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X