Threads: మస్క్ మామకు మొగుడొచ్చాడు..ట్విటర్‌కు ప్రత్యామ్నాయం..!

ట్విటర్... ఈ సోషల్ మీడియా యాప్ తెలియని వారంటూ ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని డైలీ అప్‌డేట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసే ట్వీట్స్ కోసం ఫ్యాన్స్ ఈ ట్విటర్ పిట్టను తమ ఫోన్లలో ఇన్స్‌టాల్ చేసుకుంటారు. ఈ మెసేజింగ్ యాప్‌కు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. కానీ ఎప్పుడైతే ఈ నీలిరంగు పిట్ట ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చేతిలోకి పోయిందో దీని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో దీనికి ధీటుగా థ్రెడ్స్ (Threads) అనే మెసేజింగ్ యాప్ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచం దీని గురించే చర్చిస్తోంది.

థ్రెడ్స్ (Threads) అంటే ఏంటి..? ప్రతి ఒక్కరూ దీన్నే సెర్చ్ చేస్తున్నారు. థ్రెడ్స్ అనేది ట్విటర్‌ను పోలి ఉన్న యాప్. దీన్ని మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కొత్తగా నెటిజెన్లకు పరిచయం చేశారు. అసలు థ్రెడ్స్‌ను మార్క్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారా అని చాలామందికి అనుమానం వచ్చి ఉంటుంది. ఎలాన్ మస్క్ తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలతో ట్విటర్ ఫాలోవర్స్, యూజర్లు విసిగి వేశారిపోయారు. అన్ని కొత్త నిబంధనలు తీసుకురావడంతో ట్విటర్‌కు గుడ్‌బై చెప్పేద్దామనుకుంటున్నప్పటికీ ... వేరే ప్రత్యామ్నాయం లేక ఈ బుల్లిపిట్టనే అంటుకుని ఉన్నారు. దీన్నే మార్క్ జుకర్ బర్గ్ క్యాష్ చేసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ థ్రెడ్స్‌ను తీసుకొచ్చారు.

threads

ఇక థ్రెడ్స్ పై రకరకాల విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి. ట్విటర్‌తో అసంతృప్తితో ఉన్న చాలామంది యూజర్లు థ్రెడ్స్‌కు మళ్లే అవకాశం ఉంది. దీంతో ట్విటర్‌ను మార్క్ దెబ్బతీస్తున్నట్లే అవుతుంది. ప్రస్తుతం థ్రెడ్స్‌ను యూరోపియన్ యూనియన్ దేశాల్లో లాంచ్ చేయడం లేదని మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.ఇందులో ట్విటర్‌ను మించిన ఫీచర్స్ ఉన్నాయి. కచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

threadapp1

థ్రెడ్స్ ఫీచర్స్ ఏంటి : మార్క్ జుకర్ బర్గ్ ఇంట్రొడ్యూస్ చేసిన థ్రెడ్స్ ఫీచర్స్ బాగున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులో 500 క్యారెక్టర్స్ కలిగిన మెసేజ్‌ను పోస్టు చేయొచ్చు.ట్విటర్‌లో ఉండే చాలా వరకు ఫీచర్స్‌తో పాటు మరికొన్ని అదనపు ప్రత్యేకతలు థ్రెడ్స్‌లో ఉన్నాయి. థ్రెడ్స్ తీసుకొచ్చిన నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ అంటే 50 లక్షల సైన్‌అప్స్ అయ్యాయని మార్క్ వివరించారు. ఈ యాప్‌ను యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొస్తే ఆటోమాటిగ్గా సక్సెస్ అవుతుందని వెల్లడించారు.

threadapp1

ట్విటర్‌ కంటే థ్రెడ్స్ పెద్ద యాప్‌గా అవతరిస్తుందా అన్న ప్రశ్నకు మార్క్ జుకర్ బర్గ్ సమాధానమిచ్చారు. ఇందుకు కాస్త సమయం పడుతుందని బదులిచ్చారు.100 కోట్ల యూజర్లు ఒకే యాప్‌పై చర్చించుకునేలా ఉండాలని ఆయన అన్నారు. ట్విటర్‌కు ఆ అవకాశం ఉన్నింది కానీ ఆ సంస్థ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని మార్క్ కామెంట్ చేశారు.

ఇన్స్‌టాగ్రామ్‌ ఎక్కువగా వీడియోస్ ఉండే యాప్ అని, థ్రెడ్స్ దీన్ని అధిగమించేలా టెక్ట్స్ కూడా ఉండేలా థ్రెడ్స్‌ను విస్తరించినట్లు మెటా యాజమాన్యం పేర్కొంది.ఇన్స్‌టాగ్రామ్‌లో ఏ అకౌంట్లనైతే యూజర్లు ఫాలో అవుతున్నారో..థ్రెడ్స్‌పై కూడా ఆ అకౌంట్స్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని మెటా వెల్లడించింది.ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రైవేట్‌గా ఉంటే థ్రెడ్స్‌లో మాత్రం అంతా పబ్లిక్‌గానే ఉంటుందని చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+