క్వీన్ ఎలిజబెత్ IIకు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఆయా దేశాలు కరోనా ఆంక్షలను సడలించాయి. అయితే తాజాగా బ్రిటన్‌కు చెందిన 95 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ IIకరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది.
Queen Elizabeth, 95, has tested positive for COVID and is experiencing mild symptoms, Buckingham Palace said https://t.co/QPgHz2RN66 pic.twitter.com/toRrj5YGuc
— Reuters (@Reuters) February 20, 2022
క్వీన్ ఎలిజబెత్ IIకు కరోనా టెస్టులు చేశారు. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధులు తెలిపారు. కరోనా లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో సాధారణ విధులు కొనసాగిస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు తేలికపాటి జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు.

క్వీన్ ఎలిజబెల్ II పెద్ద కొడుకు ప్రిన్స్ ఛార్లెస్‌కు ఫిబ్రవరి 10న కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే పాజిటివ్ అని తెలియక రెండ్రోజులముందు ఆయన తన తల్లిని కలిశారు . ప్రస్తుతం ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో నిబంధనలకు అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. క్వీన్ గతంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. క్వీన్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రధాని బోరిస్ జాన్స్ ట్విట్ చేశారు. ఆటు లండన్ ప్రజలు క్వీన్ ఎలిజబెత్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె ఆయురారోగ్యాలతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
I’m sure I speak for everyone in wishing Her Majesty The Queen a swift recovery from Covid and a rapid return to vibrant good health.
— Boris Johnson (@BorisJohnson) February 20, 2022












Click it and Unblock the Notifications